బాలయ్యకు ఒకటో ర్యాంకా?
ఏపీలో ప్రజాప్రతినిధుల పనితీరుపై సీఎం చంద్రబాబు చేయించిన సర్వే పలు విమర్శల పాలవుతోంది. సర్వేలో కొందరికి తక్కువగా ర్యాంకింగ్ ఇవ్వడంపై టీడీపీ నేతలు అధినేతపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నిత్యం పనిచేస్తున్నా.. నిరంతరం బాబు కోసమే పరితపిస్తున్నా తాజా సర్వే తమ ఉత్సాహంపై నీళ్లు చల్లిందని పలువురి వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఏపీలో ఏడాదికాలంగా ప్రభుత్వానికి అనేక సమస్యలు ఎదురయ్యాయి. భూసేకరణ, శేషాచలం ఎన్‌కౌంటర్, ఓటుకు నోటు కేసు తదితర విపత్కర పరిస్థితుల్లో బాబుకు అచ్చెన్నాయుడు, పల్లె […]
Advertisement
ఏపీలో ప్రజాప్రతినిధుల పనితీరుపై సీఎం చంద్రబాబు చేయించిన సర్వే పలు విమర్శల పాలవుతోంది. సర్వేలో కొందరికి తక్కువగా ర్యాంకింగ్ ఇవ్వడంపై టీడీపీ నేతలు అధినేతపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నిత్యం పనిచేస్తున్నా.. నిరంతరం బాబు కోసమే పరితపిస్తున్నా తాజా సర్వే తమ ఉత్సాహంపై నీళ్లు చల్లిందని పలువురి వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఏపీలో ఏడాదికాలంగా ప్రభుత్వానికి అనేక సమస్యలు ఎదురయ్యాయి. భూసేకరణ, శేషాచలం ఎన్‌కౌంటర్, ఓటుకు నోటు కేసు తదితర విపత్కర పరిస్థితుల్లో బాబుకు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, తదితర నాయకులు బాబుకు అండగా నిలిచారు. నిత్యం విలేకరుల సమావేశంలో పార్టీని కాపాడేందుకు శత విధాలా ప్రయత్నించారు. ఇదే సమయంలో నిత్యం షూటింగులతో బిజీగా ఉన్న హిందూపురం ఎమ్మెల్యేకు ఒకటో ర్యాంకు రావడం మిగిలిన నేతలకు మింగుడు పడటం లేదు. ప్రజల మధ్య ఉంటున్న తమకు కనీసం 2 లేదా 3 ర్యాంకులు కూడా రాలేదు… నిత్యం పక్క రాష్ట్రమైన హైదరాబాద్ లో షూటింగులలో తలమునకలయ్యే బాలయ్యకు ప్రజలు తొలిర్యాంకు ఎలా ఇస్తారన్నది ఇక్కడ తెలుగు తమ్ముళ్ల మదిలో మెదులుతున్న ప్రశ్న. అసలు ఈ సర్వే విశ్వసనీయతనే వారు ప్రశ్నిస్తున్నారు.
Advertisement