హోదాకు 10వ తేదీ డెడ్‌లైన్‌: సీపీఐ

ఆగస్టు 10లోపు ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోడి స్పష్టమైన ప్రకటన చేయకపోతే 11వ తేదీన ఏపీ బంద్‌కు పిలుపు ఇస్తామని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ప్రత్యేక హోదా డిమాండు చేస్తూ శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన బస్ యాత్ర సోమవారం తూర్పు గోదావరి జిల్లా తుని చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయడం లేదని, కాలక్షేపం కబుర్లతో కాలం వెళ్ళదీస్తున్నారని ఆరోపించారు. ఈ బస్సు 5వ తేదీ […]

Advertisement
Update:2015-08-03 08:22 IST
ఆగస్టు 10లోపు ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోడి స్పష్టమైన ప్రకటన చేయకపోతే 11వ తేదీన ఏపీ బంద్‌కు పిలుపు ఇస్తామని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ప్రత్యేక హోదా డిమాండు చేస్తూ శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన బస్ యాత్ర సోమవారం తూర్పు గోదావరి జిల్లా తుని చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయడం లేదని, కాలక్షేపం కబుర్లతో కాలం వెళ్ళదీస్తున్నారని ఆరోపించారు. ఈ బస్సు 5వ తేదీ నాటికి ఏలూరు చేరుతుందని, అక్కడ బహిరంగసభ ఏర్పాటు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ నెల 10వ తేదీ కేంద్రానికి డెడ్‌లైన్‌ అని, ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. బీజేపీ, టీడీపీ నేతలు జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Tags:    
Advertisement

Similar News