ఓవర్‌లోడుకు తప్పదు భారీ మూల్యం
రవాణా వాహనాలలో పరిమితికి మించి సరుకులు ఎక్కిస్తే… బాధ్యులైన అందరిపై జరిమానా బాదేందుకు తెలంగాణ ఆర్టీఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన చట్ట సవరణకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇప్పటివరకూ ఓవర్‌లోడుతో వెళ్లే లారీలను పట్టుకుని డ్రైవర్, లారీ యజమానిపై మాత్రమే కేసు నమోదు చేసేవారు. చట్ట సవరణ జరిగితే … సంబంధిత సరుకు యజమాని అయిన వినియోగదారుడిపై కూడా ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేసే అవకాశం కలుగుతుంది. రోడ్డు భద్రతా […]
Advertisement
రవాణా వాహనాలలో పరిమితికి మించి సరుకులు ఎక్కిస్తే… బాధ్యులైన అందరిపై జరిమానా బాదేందుకు తెలంగాణ ఆర్టీఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన చట్ట సవరణకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇప్పటివరకూ ఓవర్‌లోడుతో వెళ్లే లారీలను పట్టుకుని డ్రైవర్, లారీ యజమానిపై మాత్రమే కేసు నమోదు చేసేవారు. చట్ట సవరణ జరిగితే … సంబంధిత సరుకు యజమాని అయిన వినియోగదారుడిపై కూడా ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేసే అవకాశం కలుగుతుంది. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా కోర్టులు ఇచ్చిన ఆదేశాలను పాటించే క్రమంలో ఓవర్‌లోడుకు బాధ్యుడైన వినియోగదారుడిపై పెనాల్టీ విధించడంతోపాటు కేసు నమోదు చేసేలా చట్టసవరణ ప్రతిపాదనను ఆర్టీఏ అధికారులు సిద్ధం చేశారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ కొత్త విధానంపై వారం రోజులపాటు అవగాహన కల్పించి.. ఆ తరువాత ఓవర్‌లోడ్లు ఎదురైతే పెనాల్టీ బాదుడు షురూ చేస్తారు. పెనాల్టీలను కూడా భారీగా వడ్డించనున్నారు. ఈ చట్ట సవరణపై లారీ యజమానుల సంఘం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. డ్రైవర్, యజమానులతో సంబంధం లేకుండా వినియోగదారులు బలవంతంగా ఓవర్‌లోడ్ చేస్తే దానికి తాము జరిమానాలు కట్టాల్సి వస్తోందని, ఈ కొత్త చట్టంతో వినియోగదారులకు కూడా అవగాహన కలుగుతుందని లారీ యజమానులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement