బాహుబలిని తిడితే ప్రచారం వస్తుందా..

లోకమంతా బాహుబలి సినిమాను మెచ్చుకుంటోంది. ఆ మెచ్చుకోలుకు తగ్గట్టుగానే సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. అయితే సినిమా కొందరికి నచ్చకపోయి ఉండొచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. ఎవరి అభిరుచులు వాళ్లకుంటాయి. సామాన్య ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పొచ్చు. అందులో తప్పులేదు. కానీ కాస్తోకూస్తో స్టేటల్ వచ్చిన తర్వాత అలా డైరక్ట్ గా చెబితే మొదటికే మోసమొస్తుంది. అలా చేసే ఇబ్బందులు తెచ్చుకుంది రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ తేజస్వి.         […]

Advertisement
Update:2015-07-20 01:02 IST
బాహుబలిని తిడితే ప్రచారం వస్తుందా..
  • whatsapp icon
లోకమంతా బాహుబలి సినిమాను మెచ్చుకుంటోంది. ఆ మెచ్చుకోలుకు తగ్గట్టుగానే సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. అయితే సినిమా కొందరికి నచ్చకపోయి ఉండొచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. ఎవరి అభిరుచులు వాళ్లకుంటాయి. సామాన్య ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పొచ్చు. అందులో తప్పులేదు. కానీ కాస్తోకూస్తో స్టేటల్ వచ్చిన తర్వాత అలా డైరక్ట్ గా చెబితే మొదటికే మోసమొస్తుంది. అలా చేసే ఇబ్బందులు తెచ్చుకుంది రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ తేజస్వి.
ఓ వైపు వర్మ, బాహుబలి సినిమాను ఆకాశానికెత్తేస్తున్నాడు. సినిమా తీయడం ఎలాగో జక్కన్నను చూసి నేర్చుకోండంటూ మిగతా దర్శకులకు చురకలు అంటిస్తున్నాడు. రాజమౌళి సృష్టించిన మేజిక్ ను ఎవరైనా క్రాస్ చేయగలరా అంటూ దర్శకుల్ని సూటిగానే ప్రశ్నిస్తున్నాడు. ఇలా సినిమాను మెచ్చుకుంటుంటే.. వర్మ హీరోయిన్ తేజస్వి మాత్రం బాహుబలిపై నెగెటివ్ కామెంట్స్ పోస్ట్ చేసింది. సినిమా అస్సలు తనకు నచ్చలేదంటూ ట్వీట్ చేసింది. దీంతో టాలీవుడ్ అంతా ఏకమై తేజస్విపై విమర్శలు గుప్పించింది. ఊహించని పరిణామానికి షాకైన తేజస్వి, కామ్ గా ఆ కామెంట్స్ ను తన ఖాతా నుంచి డిలీట్ చేసింది. అయితే ఆమె చేసిన ఈ పని మాత్రం తేజస్వి కెరీర్ ను కచ్చితంగా ఇబ్బందుల్లోకి నెడుతుందనడంలో సందేహం లేదు.
Tags:    
Advertisement

Similar News