మున్సిపాల్టీల్లో స‌మ్మెసైర‌న్‌! ఆందోళ‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ స‌మ్మె సైర‌న్ మోగింది. పదో పిఆర్‌సి ప్రకారం రూ. 15,432 కనీస వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు.  విధులు బహిష్కరించి ర్యాలీలు, రాస్తా రోకోలు, ధర్నాలు తదితర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. వారి ఆందోళనకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు పలకడం విశేషం. విజయవాడ నగర పాలక సంస్థ వద్ద మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో సమ్మె […]

Advertisement
Update:2015-07-11 03:22 IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ స‌మ్మె సైర‌న్ మోగింది. పదో పిఆర్‌సి ప్రకారం రూ. 15,432 కనీస వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. విధులు బహిష్కరించి ర్యాలీలు, రాస్తా రోకోలు, ధర్నాలు తదితర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. వారి ఆందోళనకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు పలకడం విశేషం. విజయవాడ నగర పాలక సంస్థ వద్ద మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వరకు మహాప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. మండపేటలో ధర్నా నిర్వహిం చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విధులు బహిష్కరించి, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సమ్మె చేశారు తణుకు మున్సిపల్‌ కార్యాలయం వద్ద జెఎసి ఆధ్వర్యంలో నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు ధర్నాలు నిర్వహించారు. గుడివాడ, పెడన, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, నూజివీడులో సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. గుంటూరు జిల్లాలోని పలు మున్సిపాల్టీల్లో కార్మికులు ధర్నాలు చేశారు. ప్రకాశం జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లోనూ, నగర పాలక కేంద్రంలోనూ సిఐటియు, ఎఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె జయప్రదంగా సాగింది. ఒంగోలులో ధర్నా, మార్కాపురం, చీరాల, కందు కూరులో ప్రదర్శనలు జరిగాయి. కనిగిరి కార్మికుల ధర్నాకు సిపిఎం, సిపిఐ, వైసిపి, కాంగ్రెస్‌ మద్దతు తెలిపాయి. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేటలో కార్మికులు ధర్నాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేసి విధులు బహిష్కరించారు. కడప జిల్లాలో కడప నగరపాలక సంస్థతో పాటు పలు మున్సిపాలిటీల్లో కార్మికులు ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కడప కార్పొరేషన్‌ ఎదుట కార్మికులు మహాధర్నా నిర్వహించారు. కర్నూలులో సిఐటియు, ఎఐటియుసి నాయకుల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌తో చర్చలు జరిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశారు. అనంతపురం జిల్లాలో ర్యాలీలు, మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. శ్రీకాకుళంలో మున్సిపల్‌ కార్మికులు విధులు బహిష్కరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాలకొండ మండలంలో నగర పంచాయతీ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం ఏర్పాటు చేశారు. విజయనగరం గంట స్తంభం వద్ద రాస్తారోకో, పార్వతీపురం, బొబ్బిలిలో ర్యాలీ, సాలూరులో ధర్నా చేశారు. విశాఖ నగరంలోని అన్ని జోనల్‌ కార్యాలయాల ఎదుట పారిశుధ్య కార్మికులు నిరసనలు తెలిపారు. భీమిలి, గాజువాక, మల్కాపురం జోనల్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు.
Tags:    
Advertisement

Similar News