బాహుబలి " ఫస్ట్ రిపోర్ట్
ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ సినిమాకు సంబంధించిన షోలు పడిపోయాయి. అర్థరాత్రి ఒంటిగంట నుంచే బాహుబలి మేనియా ప్రారంభమైంది. వేల రూపాయలు ధారపోసి సినిమాకు వెళ్లిన ఫ్యాన్స్ చాలా మంది సినిమా పూర్తయ్యాక శాటిస్ ఫై అయ్యారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నం ఏరియాల్లో బాహుబలి సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని షోలు పూర్తయ్యాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం సినిమా పాజిటివ్ టాక్ తో ప్రారంభమైంది. రాజమౌళి ఓ కొత్త ప్రపంచాన్ని చూపించాడనే విషయాన్ని సినిమా […]
Advertisement
ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ సినిమాకు సంబంధించిన షోలు పడిపోయాయి. అర్థరాత్రి ఒంటిగంట నుంచే బాహుబలి మేనియా ప్రారంభమైంది. వేల రూపాయలు ధారపోసి సినిమాకు వెళ్లిన ఫ్యాన్స్ చాలా మంది సినిమా పూర్తయ్యాక శాటిస్ ఫై అయ్యారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నం ఏరియాల్లో బాహుబలి సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని షోలు పూర్తయ్యాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం సినిమా పాజిటివ్ టాక్ తో ప్రారంభమైంది. రాజమౌళి ఓ కొత్త ప్రపంచాన్ని చూపించాడనే విషయాన్ని సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు. అందరి నోటి నుంచి మొట్టమొదట వస్తున్న ఫస్ట్ రిపోర్ట్ ఇదే. సెట్స్ నుంచి గెటప్స్ వరకు అన్నీ కొత్తగా ఉంటున్నాయంటున్నారు. తర్వాతే నటీనటుల పర్ ఫార్మెన్స్, మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా బాహుబలి సెకెండాఫ్ సూపర్ అనే టాక్ వచ్చేయడంతో సినిమా సేఫ్ జోన్ లోకి ఎంటరైందనిపిస్తోంది. ఎందుకంటే.. ఏ మూవీకైనా సెకెండాఫే ప్రాణం. రెండో సగం బాగుందనే టాక్ వచ్చిందంటే సినిమా దాదాపు హిట్టయిపోయినట్టే. ఈ సినిమా ఎలా ఉందో ఫుల్ రిపోర్ట్ తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే.
Advertisement