బాహుబలిపై యూఏఈలో నెగిటివ్ ప్రచారం!
అందమైన శరీరంలో ఆత్మ లేదు.. చెత్త స్క్రీన్ ప్లే… సాదాసీదా యాక్టింగ్… మౌత్ పబ్లిసిటీలో మిన్నే కాని అసలు సినిమా సున్నా… ఇంత నెగిటివ్ పబ్లిసిటీ వచ్చిన సినిమా ఏమై ఉంటుందనుకుంటున్నారా… ఇంకేమిటి… టాలివుడ్‌లో అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి తీసిన సినిమా… బాహుబలి. ఇంకా విడుదల కాని సినిమాకు ఈ టాక్ ఏమిటని అనుకుంటే సమాధానం మాత్రం ఒక్కటే. ఇది ఇండియన్ టాక్ కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు సభ్యురాలు, డిస్ట్రిబ్యూటర్ అయిన కీఆరా […]
Advertisement
అందమైన శరీరంలో ఆత్మ లేదు.. చెత్త స్క్రీన్ ప్లే… సాదాసీదా యాక్టింగ్… మౌత్ పబ్లిసిటీలో మిన్నే కాని అసలు సినిమా సున్నా… ఇంత నెగిటివ్ పబ్లిసిటీ వచ్చిన సినిమా ఏమై ఉంటుందనుకుంటున్నారా… ఇంకేమిటి… టాలివుడ్‌లో అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి తీసిన సినిమా… బాహుబలి. ఇంకా విడుదల కాని సినిమాకు ఈ టాక్ ఏమిటని అనుకుంటే సమాధానం మాత్రం ఒక్కటే. ఇది ఇండియన్ టాక్ కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు సభ్యురాలు, డిస్ట్రిబ్యూటర్ అయిన కీఆరా సంధు మాటలు. ఇండియన్ సినిమా యూఏఈ మ్యాగజైన్ రివ్యూ కూడా ఈ సినిమాకు 40 శాతం మార్కులే వేసింది. అక్కడ సెన్సార్ బోర్డు సమావేశంలోనే డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా చూశారు. వారి మాటల్లో చెప్పాలంటే … మెరిసేదంతా బంగారం కాదు. ఏవరేజ్ సినిమా కోసం మీ డబ్బులను వేస్ట్ చేసుకోకండి. ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ మూవీ అంటూ ప్రజలను పూల్స్ చేశారు. అందమైన సెట్స్ ఉన్న మాట నిజం. కంటెంట్ మాత్రం జీరో. ప్రభాస్, రానాలకు రామ్‌చరణ్, పవన్‌కల్యాణ్, మహేష్‌బాబులా స్టార్ ఇమేజ్ లేదు. డిజాస్టర్ మూవీ అంటూ కీఆరా సంధు ట్వీట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను బాహుబలి బృందం ఖండించింది. ఓ తెలుగు సినిమాకు ఇంత పెద్ద హైప్ రావడం ఓర్వలేని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి వారి మాటలు నమ్మవద్దని వారు తెలిపారు.
Advertisement