పవన్ రెంటికీ చెడ్డాడా?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. మొదటి నుంచి తెలంగాణకు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు, హెచ్చరికలు చేస్తోన్న ఆయన తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓటుకు నోటు కేసులో తన అభిప్రాయాన్ని చెప్పేందుకు ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. పౌరయుద్ధం, అంతర్గత యుద్ధం అనే పదాలు వాడినందుకు తెలంగాణవాసులు పవన్‌పై మండిపడుతున్నారు. ఇకపోతే ప్రత్యేక హోదా విషయంలో సీమాంధ్ర ఎంపీలకు పౌరుషం లేదని, ఆత్మగౌరవం లేదని తీవ్ర […]
Advertisement
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. మొదటి నుంచి తెలంగాణకు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు, హెచ్చరికలు చేస్తోన్న ఆయన తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓటుకు నోటు కేసులో తన అభిప్రాయాన్ని చెప్పేందుకు ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. పౌరయుద్ధం, అంతర్గత యుద్ధం అనే పదాలు వాడినందుకు తెలంగాణవాసులు పవన్‌పై మండిపడుతున్నారు. ఇకపోతే ప్రత్యేక హోదా విషయంలో సీమాంధ్ర ఎంపీలకు పౌరుషం లేదని, ఆత్మగౌరవం లేదని తీవ్ర పదజాలంతో విమర్శించారు. వ్యాపారాలు చేసుకునే వారు ఎంపీలవడం దురదృష్టకరం అన్నరీతిలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంపీలు కేశినేని నాని, కొనగల్ల, సుజనా చౌదరిలు తీవ్రంగా స్పందించారు. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సిందికాదన్నారు. ఆరునెలల కోసారి నిద్రలేచి ప్రజాసమస్యలంటూ మాపై నిందలేయడమేంటని ప్రశ్నించారు. పార్లమెంటులో దీనిపై ఇప్పటికే 35 సార్లు చర్చలో పాల్గొన్నామని గుర్తు చేశారు. టీడీపీ ఎంపీల ఒత్తిడితో కేంద్ర రూ.6500 కోట్లను అదనంగా మంజూరు చేసిందని వెల్లడించారు. ఇవేమీ తెలియకుండా నోరుపారేసుకోవడం తగదని హితవు పలికారు. ఎన్నికల్లో మద్దతిచ్చినందుకు సంతోషమే.. అలా అని ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాష్ర్టం విడిపోయినపుడు మీ అన్న చిరంజీవి కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నారన్న విషయం మరిచిపోయావా? అంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంటుకెళ్లి గోడలు చూసి వస్తున్నారంటూ సీమాంధ్ర ఎంపీలను విమర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు కేసీఆర్‌ను కించపరిచేలా మాట్లాడడాని పవన్ కల్యాణ్‌పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణవాదులు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఓటుకు నోటు కేసులో పవన్ తన స్పందన తెలియజేసి కొరివితొ తలగోక్కున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా తెలంగాణవాదులే ఆయన్ను వ్యతిరేకించేవారు తాజాగా మిత్రపక్షం ఎంపీలను విరోధులుగా చేసుకుని రెంటికీ చెడ్డ రేవడిలా మారాడు.
Advertisement