రేప్ కేసుల్లో సుప్రీం సంచలనాత్మక తీర్పు
అత్యాచారం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. ఇలాంటి కేసుల్లో రాజీ ప్రయత్నాలు కూడా నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం చేయడమే అసలు నేరం.. రాజీ ప్రయత్నాలు చేయడమంటే ఆ నేరాన్ని సమర్ధించడమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నారు. ఇది మహిళలు… ముఖ్యంగా బాధితుల హక్కుల్ని కాలరాయడమేనని ఆయన అన్నారు. నిందితులు, బాధితులు రాజీ చేసుకున్నా నేరంగానే పరిగణించాలని ఆయన అన్నారు. ఇలాంటి వాటిని ఘోర తప్పిదాలుగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడాల్సిందేనని […]
Advertisement
అత్యాచారం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. ఇలాంటి కేసుల్లో రాజీ ప్రయత్నాలు కూడా నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం చేయడమే అసలు నేరం.. రాజీ ప్రయత్నాలు చేయడమంటే ఆ నేరాన్ని సమర్ధించడమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నారు. ఇది మహిళలు… ముఖ్యంగా బాధితుల హక్కుల్ని కాలరాయడమేనని ఆయన అన్నారు. నిందితులు, బాధితులు రాజీ చేసుకున్నా నేరంగానే పరిగణించాలని ఆయన అన్నారు. ఇలాంటి వాటిని ఘోర తప్పిదాలుగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడాల్సిందేనని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. రాజీ ప్రయత్నాలు చేసే వారిని కూడా నేరస్థులుగానే పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. గతంలో చెన్నై కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Advertisement