కొత్తపల్లిగీత వైఎస్ఆర్‌సీపీ ఎంపీనా?
మన రాష్ట్రంలో బురదజల్లాలంటే తేలిగ్గా కనిపించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటేనేమో? ఆ పార్టీ మాత్రమే కాదు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా మిగిలిన పార్టీలకు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చాలా లోకువ. ఎక్కడ ఏది జరిగినా జగన్‌కు అంటగట్టడం, నోటికొచ్చిన ఆరోపణలన్నీ చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటుగా మారిపోయిందని తరచూ వైఎస్ఆర్‌సీపీ నాయకులు వాపోతుంటారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఉదంతం ఇందుకు తాజా నిదర్శనంగా నిలుస్తుంది. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి […]
Advertisement
మన రాష్ట్రంలో బురదజల్లాలంటే తేలిగ్గా కనిపించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటేనేమో? ఆ పార్టీ మాత్రమే కాదు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా మిగిలిన పార్టీలకు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చాలా లోకువ. ఎక్కడ ఏది జరిగినా జగన్‌కు అంటగట్టడం, నోటికొచ్చిన ఆరోపణలన్నీ చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటుగా మారిపోయిందని తరచూ వైఎస్ఆర్‌సీపీ నాయకులు వాపోతుంటారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఉదంతం ఇందుకు తాజా నిదర్శనంగా నిలుస్తుంది. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఆమె ఒక్కసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గడపతొక్కలేదు. గెలిచిన వెంటనే గీత, మరో ఎంపీ ఎస్పీవై రెడ్డీ ఇద్దరూ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కండువాలు కప్పుకుని మరీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు, కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వాళ్లు ఇన్నాళ్లూ తెలుగుదేశం నాయకులుగానే చలామణి అవుతున్నారు. మీడియా కూడా ఆ విషయాన్ని గుర్తించింది. అయితే కొత్తపల్లి గీతపైన అప్పు ఎగ్గొట్టిన కేసులో సీబీఐ చార్జిషీటు మోపగానే ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పత్రికలకు గుర్తొచ్చింది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జషీటు అన్న శీర్షికలతో వార్తలు రాసి ప్రముఖంగా అచ్చేశారు. అంటే జగన్‌పై బురద జల్లడానికి, ఆయన్ను ఆయన పార్టీని జనం లో పలుచన చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా తెలుగుదేశం పార్టీ గానీ, ఆ పార్టీ అనుకూల మీడియాగానీ వదులుకోదని దీన్ని బట్టి అర్ధమౌతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
Advertisement