షర్మిల యాత్ర కోసం భారీ కసరత్తు!
వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జరుపుతున్న పరామర్శ యాత్రపై పార్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ముఖ్యంగా ఈనెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో యాత్ర జరుగుతున్న నేపథ్యంలో పార్టీ తెలంగాణ విభాగం భారీగా కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో యాత్ర జరగనున్న నేపథ్యంలో దానిని జయప్రదం చేయకపోతే పలుచన అయిపోతామని నాయకులు భయపడుతున్నారు. రాజధాని సమీప ప్రాంతాలు కనుక మీడియాతోపాటు, ఇతర పార్టీల దృష్టి కూడా పరామర్శ యాత్రపై ఉంటుందని, అందువల్ల యాత్రను […]
వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జరుపుతున్న పరామర్శ యాత్రపై పార్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ముఖ్యంగా ఈనెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో యాత్ర జరుగుతున్న నేపథ్యంలో పార్టీ తెలంగాణ విభాగం భారీగా కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో యాత్ర జరగనున్న నేపథ్యంలో దానిని జయప్రదం చేయకపోతే పలుచన అయిపోతామని నాయకులు భయపడుతున్నారు. రాజధాని సమీప ప్రాంతాలు కనుక మీడియాతోపాటు, ఇతర పార్టీల దృష్టి కూడా పరామర్శ యాత్రపై ఉంటుందని, అందువల్ల యాత్రను ఎలాగైనా సరే విజయవంతం చేసితీరాలని నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం పార్టీ తెలంగాణ విభాగం శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యింది. మండలం మొదలుకుని రాష్ట్ర స్థాయివరకు ఉన్న నాయకులంతా ఈ నాలుగురోజుల పాటు షర్మిల వెంట నడిచి తీరాలని పార్టీ తెలంగాణ విభాగ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించినట్లు సమాచారం. షర్మిల పరామర్శ యాత్రతో తెలంగాణలో పార్టీ బలం పుంజుకోగలుగుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకే పరామర్శ యాత్ర కోసం ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయి ఇన్‌చార్జిలను కూడా నియమించారు. శుక్రవారం నాటి సమావేశంలో వారందరూ పాల్గొన్నారు.