అరక పట్టిన ఎమ్మేల్యే ఆర్ కే
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల్లో వ్యవసాయం చేయొద్దంటూ ఏపీ మంత్రి నారాయణ చేసిన ప్రకటన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఆగ్రహం కలిగించింది. దీనికి నిరసన తెలపాలనుకున్నారు. వెంటనే మండలంలోని పెనుమాక గ్రామానికి బయలుదేరారు. అక్కడ లుంగీని ఎగగట్టారు. తలకి కండువా చుట్టారు. చేత నాగలి పట్టారు. వ్యవసాయ కూలీ వేషం వేశారు. పొలంలోకి దిగి నాగలి పట్టి అరక దున్నారు. అక్కడున్న కూలీలతో కలిసి కూరగాయలు కోసి బస్తా నింపారు. పవర్ స్ర్పేయర్ తీసుకుని కాయకూరల పంటలకు […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల్లో వ్యవసాయం చేయొద్దంటూ ఏపీ మంత్రి నారాయణ చేసిన ప్రకటన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఆగ్రహం కలిగించింది. దీనికి నిరసన తెలపాలనుకున్నారు. వెంటనే మండలంలోని పెనుమాక గ్రామానికి బయలుదేరారు. అక్కడ లుంగీని ఎగగట్టారు. తలకి కండువా చుట్టారు. చేత నాగలి పట్టారు. వ్యవసాయ కూలీ వేషం వేశారు. పొలంలోకి దిగి నాగలి పట్టి అరక దున్నారు. అక్కడున్న కూలీలతో కలిసి కూరగాయలు కోసి బస్తా నింపారు. పవర్ స్ర్పేయర్ తీసుకుని కాయకూరల పంటలకు పురుగు మందులు చల్లారు. అన్నదాతల పొట్టగొట్లే ప్రభుత్వ వైఖరిని దునుమాడుతూ రాజధాని భూముల్లో సాగు చేసుకునే రైతులకు అండగా ఉంటానని ప్రకటించారు.
ఈ సందర్బంగా ఆర్.కే. మాట్లాడుతూ చంద్రబాబుకు రైతు వ్యతిరేకత పోలేదని, వ్యవసాయాన్ని విదేశాలకు తాకట్టు పెడుతూ అన్నదాతల పొట్టకొడుతున్నారని ఆయన అన్నారు. గురువారం సీఆర్‌డీఏ దగ్గర తమకు పని అయినా చూపించాలి… పొట్టకు గుప్పెడన్నమయినా పెట్టాలి… అంటూ అన్నదాతలు చేసిన నిరసన ప్రదర్శన చూస్తే చంద్రాబాబుకు కళ్ళు తెరుచుకునేవని అన్నారు. దేశానికి అన్నంపేట్టి అన్నపూర్ణ అనిపించుకున్న అన్నదాతులు ఈరోజు ఆకలి కేకలు వేయాల్సిన పరిస్థితి కల్పించారని ఆయన ఆరోపించారు. రుణ మాఫీ చేస్తామంటూ అబద్దాలు చెప్పి ఇప్పటికే రైతులను నిండా ముంచిన చంద్రబాబు గుప్పెడన్నం కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆర్.కె. ఆరోపించారు. విత్తనాల సరఫరా, పొలం బడిని నిలిపివేసి రైతుల పట్ట తనకున్న వ్యతిరేకతను మరోసారి ప్రదర్శించారని ఆయన ఆరోపించారు. 9.2, 9.3 ఫారాలు ఇచ్చిన రైతులు వ్యవసాయం చేసుకోవచ్చని హైకోర్టు తీర్పిస్తే… మంత్రులు వ్వవసాయం చేసుకోరాదని ఆదేశాలివ్వడం కోర్టుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఆర్.కే. అన్నారు.
వ్యవసాయం గురించి తెలియని మంత్రి నారాయణ రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే జాలేస్తుందని ఆయన అన్నారు. భూ సేకరణకు వెళ్ళవచ్చని కోర్టు ఇచ్చిన తీర్పు ఆరుగురు రైతులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అంతర్గత కుట్రలో భాగంగానే తుళ్ళూరు ప్రాంతానికి చెందిన ఆరుగురు రైతులను అక్విజేషన్‌పై కోర్టుకు పంపించారని, ఈ తీర్పుపై మిగిలిన రైతులు బయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి నేతృత్వంలో తామంతా రైతులకు అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. ఏ ఒక్క రైతును పంట వేయొద్దనే హక్కు మంత్రులకుగాని, ప్రభుత్వానికిగాని లేదని ఆయన అన్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని ఆర్.కె. హెచ్చరించారు.
Advertisement