నిన్న షారూక్.. తాజాగా సల్మాన్

మహేష్ హీరోయిన్ నక్కతోక తొక్కింది. తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాలు లేనప్పటికీ.. హిందీలో మాత్రం బ్రహ్మాండమైన ఆఫర్లు అందుకుంటోంది కృతి సనోన్. ఇప్పటికే టైగర్ ష్రాఫ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగుకాళ్ల సుందరి, తొలి సినిమాతోనే విజయాన్నందుకుంది. ఆ వెంటనే షారూక్ కొత్త ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించే బంగారం లాంటి ఛాన్స్ కొట్టేసింది కృతి సనోన్. యష్ చోప్రా […]

Advertisement
Update:2015-06-20 09:37 IST
మహేష్ హీరోయిన్ నక్కతోక తొక్కింది. తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాలు లేనప్పటికీ.. హిందీలో మాత్రం బ్రహ్మాండమైన ఆఫర్లు అందుకుంటోంది కృతి సనోన్. ఇప్పటికే టైగర్ ష్రాఫ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగుకాళ్ల సుందరి, తొలి సినిమాతోనే విజయాన్నందుకుంది. ఆ వెంటనే షారూక్ కొత్త ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించే బంగారం లాంటి ఛాన్స్ కొట్టేసింది కృతి సనోన్. యష్ చోప్రా బ్యానర్ లో సుల్తాన్ అనే సినిమా చేసేందుకు సిద్ధమౌతున్నాడు సల్మాన్. ఈ సినిమాలో మొదట పరిణీతి చోప్రా లేదా కంగనా రనౌత్ లో ఒకర్ని హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారు. కానీ ఫైనల్ గా ఆ గోల్డెన్ ఛాన్స్ కృతి సనోన్ ను వరించింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. చూస్తుంటే.. కృతి కూడా ఇక తెలుగు సినిమాలకు టాటా చెప్పేటట్టే కనిపిస్తోంది.
Tags:    
Advertisement

Similar News