జిహెచ్ఎంసీ కమిషనర్‌పై గవర్నర్‌కు దానం ఫిర్యాదు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం తొక్కుతున్న అడ్డదారులను, వారి ఆదేశాలను పాటిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గురువారం గ్రేటర్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులంతా గవర్నర్ నరసింహన్‌ని కలిసి తమ డిమాండ్లను ఆయన ముందుంచారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌ని తొలగించిన తర్వాత మాత్రమే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే హైదరాబాద్‌ను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. కమిషనర్ కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా పని చేస్తున్నారని దానం […]
Advertisement
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం తొక్కుతున్న అడ్డదారులను, వారి ఆదేశాలను పాటిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గురువారం గ్రేటర్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులంతా గవర్నర్ నరసింహన్‌ని కలిసి తమ డిమాండ్లను ఆయన ముందుంచారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌ని తొలగించిన తర్వాత మాత్రమే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే హైదరాబాద్‌ను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. కమిషనర్ కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా పని చేస్తున్నారని దానం ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశించిన విధంగా నగరంలోని వార్డులను అడ్డదిడ్డంగా విభజించారని, తమ పార్టీకి అనుకూలంగా ఓట్లు వచ్చేట్టుగా వార్డులను విభజించుకున్నారని, దీనికి కమిషనర్ సోమేష్ కుమార్ సహకరించారని గ్రేటర్ నాయకుడు దానం నాగేందర్ ఫిర్యాదు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగిందని ఆయన అన్నారు. ఓటర్ల జాబితాల నుంచి సెటిలర్లను తొలగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా విషయంలో, వార్డుల విభజన అంశంలో అన్ని పార్టీలను సంప్రదించాల్సి ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని, దీనికి జీహెచ్ఎంసీ కమిషనర్ సహకరిస్తున్నారని దానం ఆరోపించారు.
Advertisement