చిరంజీవి 150వ సినిమా పూరి అవుట్, వినాయక్ ఇన్ ?

ఈ మధ్య పూరీ క్యాంప్ నుండి ఎంతో కన్‌ఫ్యూజింగ్‌గా రోజుకో అనౌన్స్‌మెంట్ వస్తోంది. ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడో, ఎవరు హీరో అంటాడో, మళ్ళీ ఎవరిని మార్చేస్తాడో అంతా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటోంది. ఈ కన్‌ ఫ్యూజన్‌కి తోడు ఇప్పుడు ఒక ప్రముఖ ఇంగ్లీష్ టాబ్లాయిడ్ ఒక కథనం ప్రచురించింది. చిరంజీవి 150వ సినిమాకి దర్శకుడు మారబోతున్నాడని, పూరీ అవుట్, వినాయక్ ఇన్ అని కథనం లేటెస్ట్‌గా వచ్చింది. ఇందుకు నిదర్శనంగా, ఇటీవల గురువారం నాడు వినాయక్ గారు […]

Advertisement
Update:2015-06-13 04:18 IST

ఈ మధ్య పూరీ క్యాంప్ నుండి ఎంతో కన్‌ఫ్యూజింగ్‌గా రోజుకో అనౌన్స్‌మెంట్ వస్తోంది. ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడో, ఎవరు హీరో అంటాడో, మళ్ళీ ఎవరిని మార్చేస్తాడో అంతా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటోంది. ఈ కన్‌ ఫ్యూజన్‌కి తోడు ఇప్పుడు ఒక ప్రముఖ ఇంగ్లీష్ టాబ్లాయిడ్ ఒక కథనం ప్రచురించింది. చిరంజీవి 150వ సినిమాకి దర్శకుడు మారబోతున్నాడని, పూరీ అవుట్, వినాయక్ ఇన్ అని కథనం లేటెస్ట్‌గా వచ్చింది.

ఇందుకు నిదర్శనంగా, ఇటీవల గురువారం నాడు వినాయక్ గారు చిరంజీవిని కలిసిన ఉదంతాన్ని చూపుతున్నారు. అంతే కాక చిరంజీవి కూడా పూరీ వ్యవహార శైలితో సంతృప్తిగా లేడని, అతని డైరెక్షన్ స్కిల్స్ పైన డవుట్స్ ఉన్నాయని…అందుకే పూరీని రీప్లేస్ చేసే అవకాశం ఉందని కథనం. అన్నింటికన్నా ముఖ్యంగా.. పూరీ ఒకదాని తర్వాత ఇంకో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడమే ఈ మార్పుకు కారణం అని ఇన్‌సైడ్ టాక్. మరి వినాయక్ నిజంగానే చాన్స్ కొట్టేస్తాడా? వేచి చూడాల్సిందే!

Tags:    
Advertisement

Similar News