దీపికపై స్పందించని రణవీర్ సింగ్
బాలీవుడ్ లో ప్రస్తుతం రెండే రెండు హాట్ జంటలు. ఒకటి కత్రినాకైఫ్-రణబీర్ కపూర్. రెండోది దీపికా పదుకోన్-రణవీర్ సింగ్. ఈ రెండు జంటల్లో మొదటి జంట కథ సుఖాంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయు. కత్రినా-రణబీర్ ఇద్దరూ తమ ప్రేమను ఓపెన్ గా ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకునే ఆలోచనల్లో ఉన్నారు. త్వరలోనే ఓ ఇంటివారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రెండో జంట దీపికా పదుకోన్-రణవీర్ సింగ్. ఈ జోడీ మాత్రం తమ ప్రేమను ఓపెన్ చేయడానికి ఇష్టపడ్డం లేదు. కొన్నాళ్లు […]
Advertisement
బాలీవుడ్ లో ప్రస్తుతం రెండే రెండు హాట్ జంటలు. ఒకటి కత్రినాకైఫ్-రణబీర్ కపూర్. రెండోది దీపికా పదుకోన్-రణవీర్ సింగ్. ఈ రెండు జంటల్లో మొదటి జంట కథ సుఖాంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయు. కత్రినా-రణబీర్ ఇద్దరూ తమ ప్రేమను ఓపెన్ గా ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకునే ఆలోచనల్లో ఉన్నారు. త్వరలోనే ఓ ఇంటివారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రెండో జంట దీపికా పదుకోన్-రణవీర్ సింగ్. ఈ జోడీ మాత్రం తమ ప్రేమను ఓపెన్ చేయడానికి ఇష్టపడ్డం లేదు. కొన్నాళ్లు సీక్రెట్ గానే ప్రేమించుకోవడానికి ఇష్టపడుతున్నారు.మరీ ముఖ్యంగా దీపిక అయితే తన పర్సనల్ విషయాల్ని ఎప్పుడూ బయటపెట్టదు. ఇప్పుడిదే రూలును ఆమె ప్రేమికుడు రణవీర్ కూడా ఫాలో అవుతున్నాడు. కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన రణవీర్ ను అంతా దీపికతో ప్రేమాయణం గురించే ప్రశ్నించారు. కానీ రణవీర్ మాత్రం సైలెంట్ అయ్యాడు. పైగా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా.. లేక దీపిక గురించి అడుగుతున్నారా.. అంటూ తెలివిగా తప్పించుకున్నాడు. మరి వీళ్ల ప్రేమ ఎప్పుడు పబ్లిక్ అవుతుందో చూడాలి.
Advertisement