టీ-పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ సొంతడబ్బా: ఉత్తమ్
పాఠ్యాంశాల్లో సోనియాగాంధీ ప్రస్తావన లేకుండా తెలంగాణ కేసీఆర్ వల్లే వచ్చిందంటూ ఆయనకు జేజేలు పలకడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. పాత సిలబస్‌తో కూడిన పుస్తకాల్లో సోనియా ప్రస్తావన లేని విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళగా కొత్త సిలబస్‌లో సోనియా ప్రస్తావన ఉంటుందన్న కేసీఆర్ మాట మార్చారని టి-పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి అరోపించారు. కాని తీరా చూస్తే ఇపుడు వచ్చిన పుస్తకాల్లో కూడా సోనియా వల్లే తెలంగాణ వచ్చిన విషయాన్ని విస్మరించారని వారన్నారు. ఇలాంటి పనులు […]
Advertisement
పాఠ్యాంశాల్లో సోనియాగాంధీ ప్రస్తావన లేకుండా తెలంగాణ కేసీఆర్ వల్లే వచ్చిందంటూ ఆయనకు జేజేలు పలకడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. పాత సిలబస్‌తో కూడిన పుస్తకాల్లో సోనియా ప్రస్తావన లేని విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళగా కొత్త సిలబస్‌లో సోనియా ప్రస్తావన ఉంటుందన్న కేసీఆర్ మాట మార్చారని టి-పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి అరోపించారు. కాని తీరా చూస్తే ఇపుడు వచ్చిన పుస్తకాల్లో కూడా సోనియా వల్లే తెలంగాణ వచ్చిన విషయాన్ని విస్మరించారని వారన్నారు. ఇలాంటి పనులు విద్యార్థుల్లో అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని అన్నారు. పాఠ్యపుస్తకాల్లోని 14 పేజీల్లో తెలంగాణ సాధనకు కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఆయన వల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని సొంత డబ్బా కొట్టుకున్నారని ఉత్తమ్ తెలిపారు. అసలు సోనియా ప్రస్తావన లేకుండా చేయడం వెనుక టీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని, ఇది ఉద్దేశ్య పూర్వకంగా చేసిందేనని ఆయన ఆరోపించారు. పాఠ్యపుస్తకాలు టీఆర్ఎస్ వ్యవహారం కాదని టి-పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. జయశంకర్, అమర వీరుల ప్రస్తావన కూడా లేదని ఆయన అన్నారు. సిలబస్‌ను తక్షణం మార్చకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు.
Advertisement