బ్రూసిలీగా మారిన రామ్ చరణ్..!
ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలతో మెప్పించే ప్రయత్నం చేసిన రాంచరణ్… ఈసారి గెటప్ మార్చుకోవడానికి సిద్దం అయ్యాడు. శ్రీను వైట్ల డైరెక్షన్లో ప్రొడ్యూసర్ డీవివి దానయ్య నిర్మిస్తున్న సినిమాలో రాంచరణ్ ఫైట్ మాస్టర్‌గా కనిపించనున్నాడట. సినిమాలో స్టంట్ మాస్టర్ రోల్ చేయనున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా ఫైట్స్ నేర్చుకోవడానికి రాంచరణ్ థాయ్ లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ హాలీవుడ్ చిత్రాలకు స్టంట్స్ చేసిన ఒక ఫైట్ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యారు. ఆయనతో కలసి రాంచరణ్ […]
Advertisement
ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలతో మెప్పించే ప్రయత్నం చేసిన రాంచరణ్… ఈసారి గెటప్ మార్చుకోవడానికి సిద్దం అయ్యాడు. శ్రీను వైట్ల డైరెక్షన్లో ప్రొడ్యూసర్ డీవివి దానయ్య నిర్మిస్తున్న సినిమాలో రాంచరణ్ ఫైట్ మాస్టర్‌గా కనిపించనున్నాడట. సినిమాలో స్టంట్ మాస్టర్ రోల్ చేయనున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా ఫైట్స్ నేర్చుకోవడానికి రాంచరణ్ థాయ్ లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ హాలీవుడ్ చిత్రాలకు స్టంట్స్ చేసిన ఒక ఫైట్ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యారు. ఆయనతో కలసి రాంచరణ్ సెల్ఫీలు దిగి సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ మై నేమ్ ఈజ్ రాజ్ అనుకున్నారు. అయితే స్టంట్ మాస్టర్‌గా చేస్తుండటం..ఆ ఫైట్స్ ఎక్కువుగా మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించినవి కావడంతో… బ్రూసిలీ అనే టైటిల్ బావుంటుందనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.
Advertisement