కొడుక్కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
ప్రస్తుతం క్లిష్ట దశలో ఉన్నాడు అక్కినేని అఖిల్. వీవీ వినాయక్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మనంతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సిసింద్రీ, తన తొలి సినిమాతో హీరోగా వందకు వందమార్కులు కొట్టేయాలని అనుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో కొడుక్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. సినిమా విడుదలయ్యేంత వరకు లో-ప్రొఫైల్ మెయింటైన్ చేయమని సూచించాడు. ఎందుకంటే.. ఇప్పటికే అఖిల్ కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. సీసీఎల్ మ్యాచుల్లో ఆడుతూ అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. […]
Advertisement
ప్రస్తుతం క్లిష్ట దశలో ఉన్నాడు అక్కినేని అఖిల్. వీవీ వినాయక్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మనంతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సిసింద్రీ, తన తొలి సినిమాతో హీరోగా వందకు వందమార్కులు కొట్టేయాలని అనుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో కొడుక్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. సినిమా విడుదలయ్యేంత వరకు లో-ప్రొఫైల్ మెయింటైన్ చేయమని సూచించాడు. ఎందుకంటే.. ఇప్పటికే అఖిల్ కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. సీసీఎల్ మ్యాచుల్లో ఆడుతూ అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. 2 యాడ్స్ లో కూడా మెరిశాడు. వీటికి తోడు మనం క్లయిమాక్స్ లో అఖిల్ దే పైచేయి. దీంతో హీరోగా మొదటి సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. అంచనాలు ఎక్కువైతే సినిమాకు ప్రమాదమని హెచ్చరించాడు నాగ్. అందుకే కాస్త తగ్గి ఉండమన్నాడు. కుదిరితే రాబోయే సీసీఎల్ మ్యాచుల్లో పాల్గొనొద్దని కూడా సూచించాడు. ఒకవేళ మ్యాచులో గాయమైతే అది సినిమాపై ప్రభావం చూపిస్తుందని కూడా హెచ్చరించాడు. మరి తండ్రి మాటల్ని సిసింద్రీ పట్టించుకుంటాడా.. సీసీఎల్ మ్యాచుల్లో ఆడకుండా ఉండగలడా.. వెయిట్ అండ్ సీ..
Advertisement