ఫస్ట్ టైమ్.. బిగ్ ఫైట్..

టాలీవుడ్ లో ఎన్నో బిగ్ ఫైట్లు జరిగాయి.. బాలయ్య-చిరంజీవి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ ముందు పోటీపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ సినిమాలు కూడా పోటీపడిన సందర్భాలున్నాయి. అయితే ఈసారి రొటీన్ కు భిన్నంగా ఓ డిఫరెంట్ బాక్సాఫీస్ వార్ షురూ అవుతోంది. అదే ప్రభాస్-మహేష్ బాబు ఫైట్. ఇప్పటివరకు వీళ్లిద్దరి సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ బరిలో తలపడలేదు. ఈసారి మాత్రం యుద్ధం తప్పేలా లేదు.  బాహుబలి సినిమాను జులైలో విడుదల చేస్తామని […]

Advertisement
Update:2015-05-04 08:30 IST
టాలీవుడ్ లో ఎన్నో బిగ్ ఫైట్లు జరిగాయి.. బాలయ్య-చిరంజీవి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ ముందు పోటీపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ సినిమాలు కూడా పోటీపడిన సందర్భాలున్నాయి. అయితే ఈసారి రొటీన్ కు భిన్నంగా ఓ డిఫరెంట్ బాక్సాఫీస్ వార్ షురూ అవుతోంది. అదే ప్రభాస్-మహేష్ బాబు ఫైట్. ఇప్పటివరకు వీళ్లిద్దరి సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ బరిలో తలపడలేదు. ఈసారి మాత్రం యుద్ధం తప్పేలా లేదు.
బాహుబలి సినిమాను జులైలో విడుదల చేస్తామని ప్రకటించాడు రాజమౌళి. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై 10న బాహుబలి థియేటర్లలోకి వస్తుంది. అయితే ఈ సినిమా వచ్చిన వారం రోజుల్లోనే మహేష్ సినిమా కూడా విడుదల కాబోతోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు అనే సినిమా చేస్తున్నాడు ప్రిన్స్. ఈ సినిమాను జులై 17న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు డేట్స్ కనుక లాక్ అయితే ఈసారి ప్రభాస్-మహేష్ మధ్య పోటీ గ్యారెంటీ.
Tags:    
Advertisement

Similar News