6న కోర్టుకు రండి... దాసరికి సీబీఐ ఆదేశం
ప్రముఖ దర్శకుడు, యూపీఏలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావును బొగ్గు మసి ఇంకా వెంటాడుతూనే ఉంది. దాసరి మంత్రిగా ఉన్న కాలంలో బొగ్గు గనులు కేటాయించడంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరో్పణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆయన్ను ఇప్పటికే సీబీఐ రెండుసార్లు విచారించింది. బొగ్గు కుంభకోణంలో దాసరి నారాయణరావును వచ్చేనెల 6న కోర్టుకు హాజరు కావాల్సిందిగా సీబీఐ కోర్టు ఆదేశించింది. కోల్ స్కాంలో దాసరితోపాటు మరో 14 మందిపై అభియోగాలు నమోదు చేసింది. ఇందులో […]
Advertisement
ప్రముఖ దర్శకుడు, యూపీఏలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావును బొగ్గు మసి ఇంకా వెంటాడుతూనే ఉంది. దాసరి మంత్రిగా ఉన్న కాలంలో బొగ్గు గనులు కేటాయించడంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరో్పణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆయన్ను ఇప్పటికే సీబీఐ రెండుసార్లు విచారించింది. బొగ్గు కుంభకోణంలో దాసరి నారాయణరావును వచ్చేనెల 6న కోర్టుకు హాజరు కావాల్సిందిగా సీబీఐ కోర్టు ఆదేశించింది. కోల్ స్కాంలో దాసరితోపాటు మరో 14 మందిపై అభియోగాలు నమోదు చేసింది. ఇందులో దాసరితోపాటు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, జిందాల్ అధినేత నవీన్ జిందాల్, హెచ్.సి.గుప్తా తదితరులపై అభియోగాలు చేసింది. జిందాల్ సంస్థకు అనుకూలంగా వ్యవహరించేందుకు దాసరి నారాయణరావు లబ్ది పొందారని సీబీఐ తన ఆరోపణల పత్రంలో పేర్కొంది. ఇప్పటికే దాసరి నారాయణరావుదని చెబుతున్న సౌభాగ్య మీడియాకు చెందిన 2.25 కోట్ల ఆస్తులను సీబీఐ జప్తు చేసింది. అయితే సౌభాగ్య మీడియా తనది కాదని, తాను అందులో కేవలం వాటాదారుడిని మాత్రమేనని దాసరి చెబుతున్నారు. ఈ కేసులో మరో ఐదు సంస్థలపై కూడా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
Advertisement