వివాదంలో ఉత్త‌మ విల‌న్..

ఈ మ‌ధ్య స్టార్ హీరోలు న‌టించిన చిత్రాలు వివాదాలు కావ‌డం సాధార‌ణంగా జ‌రుగుతుంది. గ‌తంలో క‌మ‌ల్ హాస‌న్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో చేసిన విశ్వ‌రూపం చిత్రం విడుద‌ల‌కు ముందు ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఆ కార‌ణంగా రిలీజ్ చాల ఆల‌స్యం అయ్యింది. క‌ట్ చేస్తే దేశ‌వ్యాప్తంగా మీడియా క‌మల్ హాస‌న్ కు మ‌ద్దుతు తెల‌ప‌డంతో ఎట్ట‌కేల‌కు జ‌య‌లలిత‌ ప్ర‌భుత్వం విశ్వ‌రూపం చిత్రాన్ని విడుద‌ల చేసింది.ఇక తాజాగా క‌మ‌ల్ హాస‌న్ త‌న మిత్రుడు ర‌మేష్ అర‌వింద్ డైరెక్ష‌న్ లో […]

Advertisement
Update:2015-04-11 23:48 IST

ఈ మ‌ధ్య స్టార్ హీరోలు న‌టించిన చిత్రాలు వివాదాలు కావ‌డం సాధార‌ణంగా జ‌రుగుతుంది. గ‌తంలో క‌మ‌ల్ హాస‌న్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో చేసిన విశ్వ‌రూపం చిత్రం విడుద‌ల‌కు ముందు ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఆ కార‌ణంగా రిలీజ్ చాల ఆల‌స్యం అయ్యింది. క‌ట్ చేస్తే దేశ‌వ్యాప్తంగా మీడియా క‌మల్ హాస‌న్ కు మ‌ద్దుతు తెల‌ప‌డంతో ఎట్ట‌కేల‌కు జ‌య‌లలిత‌ ప్ర‌భుత్వం విశ్వ‌రూపం చిత్రాన్ని విడుద‌ల చేసింది.ఇక తాజాగా క‌మ‌ల్ హాస‌న్ త‌న మిత్రుడు ర‌మేష్ అర‌వింద్ డైరెక్ష‌న్ లో చేసిన ఉత్త‌మ విల‌న్ చిత్రం మ‌రోసారి వివాదాల ఊబిలో ప‌డింది. ఈ చిత్రంలో విష్ణుమూర్తి భక్తుడు ప్రహ్లాదకు, హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి జరిగే సంభాషణ ఆధారంగా తెరకెక్కిన ఒక పాట విష్ణుమూర్తి భక్తులను నిరాశకు గురిచేసే విధంగా ఉందని, మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.గ‌తంలో విశ్వరూపం చిత్రంలో ముస్లింల‌ మ‌నోభావాలు దెబ్బ‌తిసేలా వున్నాయంటూ కొన్ని ముస్లీమ్ సంఘాలు.. మ‌త సంస్థ‌లు కేసు ఫైల్ చేశాయి.

తాజాగా హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయంటూ విహెచ్ పి వంటి మ‌త సంస్థలు ఈ చిత్రం పై త‌మిళ నాట విశ్వ హిందు ప‌రిషిత్ ఆందోళ‌న ప్రారంభించింది. మరి క‌మ‌ల్ చేస్తున్న చిత్రాలు ఇలా వివాదం కావ‌డం అనేది ఎందుకు జ‌రుగుతుంది..? క‌మ‌ల్ హాస‌న్ లోక జ్ఙానం లేని వ్య‌క్తి కాదు. పైగా ఉత్తమ విల‌న్ సినిమా క‌థ‌ను క‌మ‌లే రాశారు. మరి సినిమా ప్ర‌చారానికి వివాదాన్ని ఆయుధంగా వాడాల‌నే ముంద‌స్తు ఎత్తుగ‌డ‌తోనే ఇటువంటి స‌న్నివేశాలు పెడుతున్నారా..నిజంగానే క‌థ డిమాండ్ మేర‌కు పెడుతున్నారా..? క‌మ‌ల్ హాసన్ లాంటి ఇంట‌ర్నేష‌న‌ల్ హీరోకు వివాదాల‌తో ప్రచారం అవ‌స‌రం వుంటుందా..? అస‌లేం జ‌ర‌గుతుంది అనేది సీని విమ‌ర్శ‌కుల్లో న‌డుస్తున్న చ‌ర్చ‌. అయితే ప‌రిశీల‌కులు మాత్రం, క‌ళాకారుల‌కు బాధ్య‌త ఉంటుంది, అలాగే వాళ్ల‌కు ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెష‌న్ అనేది ఉంటుంది, ప్ర‌తి విష‌యాన్ని బూత అద్దంలో చూసి మ‌త సంఘాలు..రాజ‌కీయ పార్టీలు.. కాంట్ర‌వర్సీ చేయ‌డం కూడా మంచింది కాదని అంటున్నారు. ఏది ఏమైన ఉత్తమ విల‌న్ కు త‌మిళ‌నాట ప్ర‌చార ప‌రంగా ఈ వివాదంక క‌లిసొస్తుంది అన‌డంలో డౌట్ లేదు మ‌రి.

Tags:    
Advertisement

Similar News