టీటీడీ ఛైర్మన్‌గా చదలవాడ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఈ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు చదలవాడ పేరును ఖరారు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు ఛైర్మన్ గా నియమించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఆదివారం లోగా వెలువడనున్నాయి. మరో 18 మంది సభ్యులతో పాలక మండలిని రూపొందించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక […]
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఈ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు చదలవాడ పేరును ఖరారు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు ఛైర్మన్ గా నియమించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఆదివారం లోగా వెలువడనున్నాయి. మరో 18 మంది సభ్యులతో పాలక మండలిని రూపొందించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరిని బోర్డు సభ్యులుగా నియమించనున్నారు. తెలంగాణ నుంచి చింతల, సాయన్న, సండ్రలకు బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు, భాను ప్రకాష్‌రెడ్డిని నియమించారు.-పీఆర్
Advertisement