డబ్బంటే ఎవ‌రికీ చేదు కాదు- హ‌న్సిక‌  

ఇండ‌స్ట్రీలో  హీరోగా ఎస్టాబ్లిష్‌ అయితే  కెరీర్  చాల కాలం వుంటుంది. హీరోయిన్స్ విష‌యంలో  అటువంటి స‌రిస్థితి లేదు. వాళ్ల కెరీర్ చాల  ప‌రిమితంగా ఉంటుంది.  ఆడియ‌న్స్ అభిరుచి అంటూ  ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త  హీరోయిన్స్ ను ఎంపిక చేసుకోవ‌డానికే  ఫిల్మ్ మేక‌ర్స్ ఇష్ట ప‌డుతుంటారు.  బాగా స‌క్సెస్ అయిన హీరోయిన్‌ మ‌హా అయితే ప‌దేళ్లు వుంటుంది.  అందుకే దీపం వుండగానే  ఇల్లు చ‌క్క‌బెట్టుకునే ప‌ని చేస్తుంటారు. కానీ  ముద్దుగుమ్మ హ‌న్సిక మాత్రం   అలా కాద‌ట‌. త‌న‌కు డ‌బ్బ సంపాద‌నే […]

Advertisement
Update:2015-04-09 15:15 IST

ఇండ‌స్ట్రీలో హీరోగా ఎస్టాబ్లిష్‌ అయితే కెరీర్ చాల కాలం వుంటుంది. హీరోయిన్స్ విష‌యంలో అటువంటి స‌రిస్థితి లేదు. వాళ్ల కెరీర్ చాల ప‌రిమితంగా ఉంటుంది. ఆడియ‌న్స్ అభిరుచి అంటూ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త హీరోయిన్స్ ను ఎంపిక చేసుకోవ‌డానికే ఫిల్మ్ మేక‌ర్స్ ఇష్ట ప‌డుతుంటారు. బాగా స‌క్సెస్ అయిన హీరోయిన్‌ మ‌హా అయితే ప‌దేళ్లు వుంటుంది. అందుకే దీపం వుండగానే ఇల్లు చ‌క్క‌బెట్టుకునే ప‌ని చేస్తుంటారు. కానీ ముద్దుగుమ్మ హ‌న్సిక మాత్రం అలా కాద‌ట‌. త‌న‌కు డ‌బ్బ సంపాద‌నే ధ్యేయం కాద‌ట‌. లైఫ్ లో ఏ విష‌యానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇస్తుంద‌ట‌. దేనికీ ఎడిక్ట్ అవ్వ‌డం అనే ప్ర‌శ్నే లేద‌ట‌. అందుకే త‌ను ఇంత హ్యాపీగా ఉంటుంద‌ని తేలిపింది. డ‌బ్బు సంపాద‌న వుండాలి కానీ.. లైఫ్ అంటే డ‌బ్బు సంపాదనే కాదు అని త‌న ఫిలాస‌ఫి ని తెలిపింది. అన్ని బ్యాలెన్డ్స్ గా వుంచుకోవ‌డం అంటేనే ఇష్ట‌మ‌ట‌. ఇక కెరీర్ ప‌రంగా తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు కానీ.. త‌మిళ్ లో మాత్రం చేతినిండా చిత్రాలున్నాయి ఈ బొద్దుగుమ్మ‌కు. అన్న‌ట్లు హ‌న్సిక లాంటి బొద్దుగుమ్మ‌లంటే త‌మిళ తంబీల‌కు చాల ఆస‌క్తి అనే విష‌యం అక్క‌డ ఫిల్మ్ మేక‌ర్స్ కు బాగా తెలుసు మ‌రి.!

Tags:    
Advertisement

Similar News