"శంకరాభరణం" అన్నా మర్యాద లేదా ?

1980లో కె.విశ్వనాధ్ తీసిన శంకరాభరణం సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసికల్ సినిమాగా నిలిచి పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు అందరిని ఈ సినిమా అలరించింది. ఈ మధ్యనే తమిళ్ లోకి అనువాదం చేసి రిలీజ్ కూడా చేసారు. ఇంత ఘన చరిత్ర గల శంకరాభరణం టైటిల్ తో ఇప్పుడు రచయిత కోన వెంకట్, నిఖిల్ హీరోగా బీహార్ బ్యాక్ డ్రాప్లో ఓ క్రైమ్,కామెడి సినిమాని ప్లాన్ చేసారు. కొన్ని సంవత్సరాల తరువాత […]

Advertisement
Update:2015-03-29 07:44 IST

1980లో కె.విశ్వనాధ్ తీసిన శంకరాభరణం సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసికల్ సినిమాగా నిలిచి పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు అందరిని ఈ సినిమా అలరించింది. ఈ మధ్యనే తమిళ్ లోకి అనువాదం చేసి రిలీజ్ కూడా చేసారు. ఇంత ఘన చరిత్ర గల శంకరాభరణం టైటిల్ తో ఇప్పుడు రచయిత కోన వెంకట్, నిఖిల్ హీరోగా బీహార్ బ్యాక్ డ్రాప్లో ఓ క్రైమ్,కామెడి సినిమాని ప్లాన్ చేసారు. కొన్ని సంవత్సరాల తరువాత శంకరాభరణం అంటే క్లాసికల్ మ్యూజిక్ సినిమానా లేక క్రైమ్ సినిమానా అనే సందేహం రాకూడదు.
హిందీలో కొన్ని సినిమాలకు కధతో పాటు టైటిల్, క్యారెక్టర్స్ అన్నిటికి పేటెంట్ హక్కులు తీసుకుంటుంటే, తెలుగులో కొన్ని చిత్రాల నిర్మాతలు ఆ సినిమాలకి ఉన్న గౌరవాన్ని గాలిలోకి వదిలేస్తున్నారు. అందుకే మాయాబజార్ పేరుతో మూడు సినిమాలు వచ్చాయి. ఉషాకిరణ్ మూవీస్ తమ ప్రతి సినిమా టైటిల్ ను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తున్నారు. శంకరాభరణంలాంటి క్లాసికల్ సినిమా విషయంలో చిత్ర నిర్మాతలు ఎందుకు గాలికి వదిలేశారో తెలియడంలేదు.

Tags:    
Advertisement

Similar News