Telugu Global
Agriculture

మిగతా 47 లక్షల మందికి రైతుభరోసా ఎప్పుడిస్తారు?

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు

మిగతా 47 లక్షల మందికి రైతుభరోసా ఎప్పుడిస్తారు?
X

రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 47 లక్షల మంది రైతులకు రైతుభరోసా బాకీ ఉందని.. వాళ్లందరికీ ఎప్పుడు పెట్టుబడి సాయం అందజేస్తుందో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. రైతుభరోసా విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది గోరంత చెప్పుకునేది కొండంత అన్నట్టుగా ఈ ప్రభుత్వం తీరు ఉందన్నారు. ఎకరానికి ఒక్క సీజన్‌ కు రూ.7,500 ఇస్తామని హామీ ఇచ్చి రూ.6 వేలకు కుదించారని, మొత్తం రైతుల్లో ఎకరంలోపు భూములున్న వారికి మాత్రమే పెట్టుబడి సాయం ఇచ్చారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2023 వానాకాలంలో ఎకరంలోపు ఉన్న రైతులు 22,55,181 మందికి రైతుభరోసా ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,09,851 మందికి పెట్టుబడి సాయం ఇవ్వకుండా కోత పెట్టిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 415 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. వానాకాలంలో ఒక్క రైతుకు కూడా రైతుభరోసా సాయం చేయలేదని, ఒక్కో రైతుకు ప్రభుత్వం ఎకరానికి రూ.17,500 చొప్పున బాకీ పడిందన్నారు. రైతుల బాకీ ఎప్పుడు తీరుస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

First Published:  5 Feb 2025 10:25 PM IST
Next Story