రాష్ట్రంలోని 577 గ్రామాల్లోని 4,41,911 మంది రైతులకు చెందిన 9,48,333 ఎకరాలకు గాను సోమవారం రూ.569 కోట్ల రైతుభరోసా జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో మండలానికి ఒక గ్రామంలోని రైతులకు రైతుభరోసా సాయం విడుదల చేశామని తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతుభరోసా కింద సాయం అందజేస్తామని.. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని వివరణ ఇచ్చారు.
Add A Comment