Telugu Global
NEWS

ఆంధ్రప్రదేశ్ టీ-20 లీగ్ కు కౌంట్ డౌన్ టోర్నీని ఆవిష్కరించిన సీఎం జగన్

రెండేళ్లకో..మూడేళ్లకో విశాఖ వేదికగా జరిగే టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లతో ఇప్పటి వరకూ ఊరట పొందుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానుల కోసం… ఆంధ్ర ప్రీమియర్ టీ-20 లీగ్ కు కొద్దిరోజుల్లో విశాఖ వేదికగా తెరలేవనుంది. జూల్ 6 నుంచి 17 వరకూ 11 రోజులపాటు విశాఖలోని డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా నిర్వహించే ఈ ప్రారంభలీగ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఏపీఎల్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్… ఇప్పటికే […]

AP T-20
X

రెండేళ్లకో..మూడేళ్లకో విశాఖ వేదికగా జరిగే టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లతో ఇప్పటి వరకూ ఊరట పొందుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానుల కోసం… ఆంధ్ర ప్రీమియర్ టీ-20 లీగ్ కు కొద్దిరోజుల్లో విశాఖ వేదికగా తెరలేవనుంది. జూల్ 6 నుంచి 17 వరకూ 11 రోజులపాటు విశాఖలోని డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా నిర్వహించే ఈ ప్రారంభలీగ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.

ఏపీఎల్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్…

ఇప్పటికే దేశంలోని వివిధ క్రికెట్ సంఘాలు తమకంటూ ఓ ప్రత్యేక టీ-20 లీగ్ ను నిర్వహించుకోడానికి బీసీసీఐ అనుమతిస్తూ వస్తోంది. తమిళనాడు, కర్నాటక, సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘాలు గత కొద్దిసంవత్సరాలుగా తమతమ రాష్ట్ర్రాల లీగ్ ను నిర్వహిస్తూ ప్రతిభావంతులైన పలువురు యువఆటగాళ్లను ఐపీఎల్ దిశగా నడిపిస్తున్నాయి.

ఆ కోవలోనే ఆంధ్రక్రికెట్ సంఘం సైతం ఓ టీ-20 లీగ్ కు శ్రీకారం చుట్టింది. బీసీసీఐ అనుమతి రావడంతో టోర్నీ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. మొత్తం ఆరు ఫ్రాంచైజీల ఆటగాళ్ల వేలం కార్యక్రమానికి ముందే…టోర్నీ లోగో ఆవిష్కరణ చేపట్టింది.

ఆరు ఫ్రాంచైజీల కోసం 27 సంస్థల పోటీ…

ఏపీఎల్‌ 2022 టోర్నీ కోసం మొత్తం ఆరు ఫ్రాంచైజీలను మాత్రమే నిర్వాహక సంఘం ఎంపిక చేసింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫ్రాంచైజీల ఎంపికను ఖరారు చేసింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు రికార్డుస్థాయిలో 27 ఫ్రాంచైజీల నుంచి ఎంట్రీలు అందాయి. అయితే…వీటిని తొమ్మిదికి కుదించి…చివరకు ఆరు ఫ్రాంచైజీలను ఖరారు చేశారు.

ఫైనల్ మ్యాచ్ కు సీఎం జగన్ హాజరు…

బరిలో నిలిచిన మొత్తం 6 ఫ్రాంచైజీలు.. 20 మంది ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బందిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఏపీఎల్‌ అధికారిక స్పాన్సర్‌గా శ్రీరామ్ గ్రూప్ వ్యవహరిస్తున్నది. జూన్ 24న జరిగే వేలంలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన యువఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఈ లీగ్ కు . జూలై 17న జరిగే టైటిల్ మ్యాచ్‌ కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన అతిధిగా రానున్నట్లు ఏసీఏ సీఈవో శివారెడ్డి తెలిపారు ఏపీఎల్‌ లో పాల్గొనే జట్లలో ..1. ఉత్తర ఆంధ్ర లయన్స్, 2. రాయలసీమ కింగ్స్, 3. గోదావరి టైటాన్స్, 4. కోస్టల్ రైడర్స్, 5. బెజవాడ టైగర్స్,
6. వైజాగ్ వారియర్స్ ఉన్నాయి.

First Published:  24 Jun 2022 7:46 AM IST
Next Story