Telugu Global
NEWS

కోనసీమ అల్లర్ల పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు..

కోనసీమ జిల్లా పేరుని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న రోజే.. కోనసీమ అల్లర్లపై సిటింగ్ జడ్జితో విచారణ జరపాలన్న పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్స్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయన్న హైకోర్టు, పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ వేసే ముందు ఆలోచించాలని సూచించింది. ఇలాంటి పిటిషన్స్ వేయడం మంచిది కాదని చెప్పిన కోర్టు.. పిటిషనర్ కు 50 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని […]

konaseema
X

కోనసీమ జిల్లా పేరుని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న రోజే.. కోనసీమ అల్లర్లపై సిటింగ్ జడ్జితో విచారణ జరపాలన్న పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్స్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయన్న హైకోర్టు, పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ వేసే ముందు ఆలోచించాలని సూచించింది. ఇలాంటి పిటిషన్స్ వేయడం మంచిది కాదని చెప్పిన కోర్టు.. పిటిషనర్ కు 50 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీంతో పిటిషనర్ న్యాయస్థానంకు క్షమాపణలు చెప్పారు.

మరోవైపు కోనసీమకు ఇప్పుడున్న పేరే కొనసాగించాలని, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై కూడా హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఏపీ కేబినెట్ తుది నిర్ణయం తీసేసుకుంది కాబట్టి.. ఈ పిటిషన్ల విచారణను హైకోర్ట్ తోసిపుచ్చే అవకాశముంది.

కోనసీమలో హై అలర్ట్..

కోనసీమ జిల్లా పేరు మార్చిన సందర్భంగా.. మరోసారి అక్కడ హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 కొనసాగుతోంది. అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. జిల్లా పేరు మార్పు తర్వాత సంబరాలు కానీ, నిరసనలు కానీ జరగడానికి అవకాశం లేకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వాస్తవానికి జిల్లా పేరు మార్పు తర్వాత పెద్ద ఎత్తున సంబరాలు జరిపేందుకు కొంతమంది సన్నాహాలు చేసుకున్నారు. కానీ పోలీసులు వారికి అనుమతి ఇవ్వలేదు. నిరసనలకు కూడా అవకాశం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

First Published:  24 Jun 2022 12:40 PM IST
Next Story