తెలంగాణ పోలీస్ టూల్.. దేశంలోనే నెంబర్-1
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) నిర్వహించిన సీసీటీఎన్‌ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ చాలెంజ్-2022లో తెలంగాణ పోలీస్ టూల్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. పోలీస్ అప్లికేషన్ విభాగంలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. తెలంగాణ పోలీస్ తయారు చేసిన సైబర్ క్రైం అనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టం -Cycaps (సైకాప్స్) టూల్ కు ప్రశంసలు లభించాయి. ఈ సైకాప్స్ టూల్ సృష్టి కర్త.. ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీ దేవేందర్ సింగ్. […]
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) నిర్వహించిన సీసీటీఎన్‌ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ చాలెంజ్-2022లో తెలంగాణ పోలీస్ టూల్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. పోలీస్ అప్లికేషన్ విభాగంలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. తెలంగాణ పోలీస్ తయారు చేసిన సైబర్ క్రైం అనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టం -Cycaps (సైకాప్స్) టూల్ కు ప్రశంసలు లభించాయి. ఈ సైకాప్స్ టూల్ సృష్టి కర్త.. ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీ దేవేందర్ సింగ్. పోలీస్ అప్లికేషన్ విభాగంలో మొదటి స్థానంలో సైకాప్స్ నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో హర్యానా పోలీసులు రూపొందించిన యాప్స్ ఉన్నాయి.
ఏంటీ సైకాప్స్..
సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు రూపొందించిన యాప్ సైకాప్స్. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటూ.. వినియోగదారుల బ్యాంక్ ఖాతాలు లూటీ చేస్తున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ఈ సైకాప్స్ టూల్ బాగా ఉపయోగపడుతోంది. సైకాప్స్ లో దేశవ్యాప్తంగా ఉన్న 3,13,006 మంది సైబర్ నేరగాళ్ల ప్రొఫైల్స్ ను నిక్షిప్తం చేశారు. వీరిలో 2,952మందిని వివిధ రాష్ట్రాల పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నంబర్ 15260, డయల్ 100, డయల్ 112 ద్వారా నమోదవుతున్న సైబర్ నేరాలతో పాటు నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) డేటాను సైకాప్స్ లో ప్రతిరోజూ అప్ డేట్ చేస్తుంటారు పోలీసులు. ఈ యాప్ ని తెలంగాణ పోలీసులు రూపొందించగా ఉత్తర ప్రదేశ్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ పోలీసులు కూడా దీన్ని వినియోగిస్తున్నారు. సైబర్ కేటుగాళ్లను పట్టుకుంటున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా ఈ యాప్ పనిచేస్తుంది. తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ) వ్యవస్థ ద్వారా ఇది పనిచేస్తుంది. ఇప్పటి వరకు సైకాప్స్ డేటా సహకారంతో దేశవ్యాప్తంగా 28 వేల సైబర్ క్రైం కేసులను ఛేదించడం విశేషం. సైకాప్స్ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్ల డేటాను సేకరించి, క్రోడీకరించి, రియల్ టైమ్ లో వారు ఎక్కడ ఉన్నారనే ప్రాంతాలను గుర్తించి, వాటిని హాట్ స్పాట్స్ గా మ్యాపింగ్ చేస్తున్నారు పోలీసులు. దీంతో ఈ యాప్ ఉపయోగించేవారికి వారిని గుర్తించడం సులభమవుతుంది. అందుకే సైకాప్స్ యాప్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
కేటీఆర్ ప్రశంసలు..
NCRB నిర్వహించిన సైబర్ చాలెంజ్-2022లో తెలంగాణ పోలీస్ టూల్ కి మొదటి స్థానం లభించడం పట్ల.. మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ లో ఆయన తెలంగాణ పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు. తెలంగాణ పోలీస్ మరిన్ని ఆవిష్కరణలతో ప్రశంసలు అందుకోవాలని ఆకాంక్షించారాయన. సైకాప్స్ పనితీరు బాగుందని, ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ యాప్ ని ఉపయోగించడం మరింత సంతోషకరమైన విషయం అని ట్వీట్ చేశారు కేటీఆర్.