Telugu Global
NEWS

టీకాలు మురిగిపోతున్నా.. తెలంగాణకు బూస్టర్ కేటాయింపుల్లేవు..

కొవిడ్ టీకా ని దేశ ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ఇదో బృహత్తర కార్యక్రమం అని పదే పదే ప్రకటించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. బూస్టర్ డోస్ టైమ్ కి దాదాపుగా చేతులెత్తేసింది. బూస్టర్ డోస్ ఇస్తున్నామని ప్రకటించినా కేవలం 60 ఏళ్లు పైబడినవారికే ఉచితం అని, మిగతావాళ్లంతా ప్రైవేటు కేంద్రాల్లో బూస్టర్ డోసు తీసుకోవాలనే నిబంధన విధించింది. ముఖ్యంగా తెలంగాణ విషయంలో బూస్టర్ డోస్ ల కేటాయింపులు దాదాపుగా ఆగిపోయాయి. పోనీ కేంద్రం వద్ద టీకా నిల్వలు […]

Booster
X

కొవిడ్ టీకా ని దేశ ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ఇదో బృహత్తర కార్యక్రమం అని పదే పదే ప్రకటించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. బూస్టర్ డోస్ టైమ్ కి దాదాపుగా చేతులెత్తేసింది. బూస్టర్ డోస్ ఇస్తున్నామని ప్రకటించినా కేవలం 60 ఏళ్లు పైబడినవారికే ఉచితం అని, మిగతావాళ్లంతా ప్రైవేటు కేంద్రాల్లో బూస్టర్ డోసు తీసుకోవాలనే నిబంధన విధించింది. ముఖ్యంగా తెలంగాణ విషయంలో బూస్టర్ డోస్ ల కేటాయింపులు దాదాపుగా ఆగిపోయాయి. పోనీ కేంద్రం వద్ద టీకా నిల్వలు లేవా అంటే అది అసలు సమస్యే కాదు. ఆదివారానికి దేశవ్యాప్తంగా 12.77 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయి. మరో రెండు నెలల్లో లక్షల డోసుల గడువు ముగుస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి టీకాలను వెంటనే పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. ఆ టీకాలను సద్వినియోగం చేయాలని, అవసరమైన రాష్ట్రాలకు వెంటనే పంపిణీ చేయాలని కోరుతున్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు.

మూడుసార్లు విన్నవించినా ఫలితం శూన్యం..

అర్హులందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో బూస్టర్‌ డోస్‌ వేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి మూడుసార్లు విజ్ఞప్తి చేశారు. రెండు దఫాలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖలు రాశారు హరీష్ రావు. మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ లో విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎన్నిసార్లు విన్నవించినా తెలంగాణకు మాత్రం టీకాలు సరఫరా కాకపోవడం విశేషం.

కేంద్రం టీకాలు సకాలంలో పంపిణీ చేయకపోవడంతో.. తెలంగాణలో కేవలం 3 శాతం మంది అర్హులకు మాత్రమే బూస్టర్ డోస్ లు పంపిణీ అయ్యాయి. మొత్తం 2.76 కోట్ల మంది అర్హులు ఉండగా.. అందులో ఇప్పటి వరకు 9.19 లక్షల మంది మాత్రమే బూస్టర్‌ డోస్‌ వేసుకొన్నారు. మిగతా వారికి టీకాలు లేవు, కేంద్రాన్ని అడిగినా పట్టించుకోవడంలేదు. మిగులు టీకాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, తెలంగాణకు బూస్టర్ డోసులను పంపించాలని అంటున్నారు నేతలు.

First Published:  20 Jun 2022 8:09 AM IST
Next Story