Telugu Global
NEWS

రాజకోట రాజా భారత్ నాలుగో టీ-20లో సఫారీలు సఫా

భారత్ – దక్షిణాఫ్రికాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ నీకో రెండు, నాకో రెండు అన్నట్లుగా సాగుతోంది. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన కీలక నాలుగో టీ-20 సమరంలో ఆతిథ్య భారత్ అతిపెద్ద విజయంతో సమఉజ్జీగా నిలిచింది. సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలిగింది. దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ షో… సిరీస్ చేజారకుండా ఉండాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో కీలక టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగి..20 ఓవర్లలో […]

Ind vs Sa
X

భారత్ – దక్షిణాఫ్రికాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ నీకో రెండు, నాకో రెండు అన్నట్లుగా సాగుతోంది. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన

కీలక నాలుగో టీ-20 సమరంలో ఆతిథ్య భారత్ అతిపెద్ద విజయంతో సమఉజ్జీగా నిలిచింది. సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలిగింది.

దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ షో…

సిరీస్ చేజారకుండా ఉండాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో కీలక టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగి..20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు సాధించింది.

టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్లో దినేశ్ కార్తీక్, హార్థిక్ పాండ్యా కీలక భాగస్వామ్యంతో మెరుపులు మెరిపించారు. ఒక దశలో 40 పరుగులకే 3 వికెట్లు నష్టపోయిన భారత్ ను పాండ్యా- కార్తీక్ ల జోడీ ఆదుకొన్నారు.

పాండ్యా 31 బాల్స్ లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు సాధించగా..వెటరన్ దినేశ్ కార్తీక్ మెరుపు హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

37 ఏళ్లవయసులో తొలి హాఫ్ సెంచరీ…

దినేశ్ కార్తీక్ కేవలం 27 బాల్స్ లోనే 9 ఫోర్లు, 2సిక్సర్లతో 55 పరుగులు సాధించడం ద్వారా భారత్ కు మ్యాచ్ విన్నింగ్‌ స్కోరు అందించాడు. ఈ క్రమంలో అతిపెద్ద వయసులో టీ-20 హాఫ్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. మహేంద్రసింగ్ ధోనీ పేరుతో ఉన్న రికార్డును దినేశ్ కార్తీక్ 37 సంవత్సరాల వయసులో
తొలి అర్థశతకం సాధించడం ద్వారా అధిగమించగలిగాడు.

16 సంవత్సరాల క్రితం భారతజట్టు తరపున బరిలో నిలిచిన దినేశ్ కార్తీక్ తన తొలి టీ-20 అంతర్జాతీయ హాఫ్ సెంచరీ నమోదు చేయటానికి సుదీర్ఘకాలం వేచిచూడాల్సి వచ్చింది.

87 పరుగులకే సఫారీల ప్యాకప్..

మ్యాచ్ తో పాటు సిరీస్ నెగ్గాలంటే 170 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. భారత యువఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో సఫారీలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆవేశ్ ఖాన్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. సఫారీ ఆటగాళ్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు.

చహాల్ 2 వికెట్లు, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టడంతో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌటయ్యింది. భారత్ ప్రత్యర్థిగా సఫారీలకు

ఇదే అతితక్కువ స్కోరు కావడం విశేషం.అంతేకాదు 82 పరుగుల అతిపెద్ద ఓటమి కూడా ఇదే కావటం మరో రికార్డు.
భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన దినేశ్ కార్తీక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టీ-20 సమరం…19న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుంది.

First Published:  18 Jun 2022 4:05 AM IST
Next Story