Telugu Global
NEWS

అచ్చొచ్చిన గ్రౌండ్ లో భారత్ భలే గెలుపు! విశాఖ టీ-20లో చహాల్ స్పిన్ జాదూ

స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి- ఏసీఏ స్టేడియం భారత్ కు అచ్చొచ్చిన క్రికెట్ వేదికగా మరోసారి నిరూపించుకొంది. టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో నెగ్గితీరాల్సిన పోరులో భారత్ 48 పరుగుల భారీవిజయంతో.. సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో చిత్తుగా ఓడిన భారతజట్టు..విశాఖ వేదికగా ముగిసిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో మాత్రం చెలరేగి ఆడింది. టాస్ […]

అచ్చొచ్చిన గ్రౌండ్ లో భారత్ భలే గెలుపు! విశాఖ టీ-20లో చహాల్ స్పిన్ జాదూ
X

స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి- ఏసీఏ స్టేడియం భారత్ కు అచ్చొచ్చిన క్రికెట్ వేదికగా మరోసారి నిరూపించుకొంది. టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో నెగ్గితీరాల్సిన పోరులో భారత్ 48 పరుగుల భారీవిజయంతో..

సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో చిత్తుగా ఓడిన భారతజట్టు..విశాఖ వేదికగా ముగిసిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో మాత్రం చెలరేగి ఆడింది.

టాస్ ఓడినా…..

సిరీస్ కే కీలకంగా, ఆతిథ్య భారత్ కు చావోబతుకో అన్నట్లుగా మారిన ఈ పోరులో సఫారీ కెప్టెన్ బవుమా ముందుగా కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోడంతో…పంత్ సేన బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది.
భారత యువఓపెనర్ల జోడీ రితురాజ్ గయక్వాడ్, ఇషాన్ కిషన్ మొదటి వికెట్ కు 98 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. భారత ఓపెనర్లిద్దరూ..35బాల్స్ లోనే అర్ధశతకాలు పూర్తి చేయడం విశేషం.

రితురాజ్ 35 బంతులు ఎదుర్కొని 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 57 పరుగులు, ఇషాన్ కిషన్ 35 బాల్స్ లో 5 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 54 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు.
మిడిలార్డర్లో హార్థిక్ పాండ్యా 21 బాల్స్ లో 4 బౌండ్రీలతో 31 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు సాధించగలిగింది.
సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ 2 వికెట్లు, రబాడా, షంషీ, మహారాజ్ తలో వికెట్ పడగొట్టారు.

యజువేంద్ర జాలం…

యజువేంద్ర జాలం...

180 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాను భారత స్పిన్ జోడీ అక్షర్ పటేల్, యజువేంద్ర చహాల్..దెబ్బ మీద దెబ్బ కొడుతూ కట్టడి చేశారు. ఓపెనర్లు బవుమా 8, హెండ్రిక్స్ 23, ప్రిటోరియస్ 20, డుసెన్ 1, క్లాసెన్ 29, మిల్లర్ 3, పార్నెల్ 22, మహారాజ్ 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో సఫారీజట్టు 20 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో పేసర్ హర్షల్ పటేల్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన యజువేంద్ర చహాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రాజ్ కోట వేదికగా 17న సిరీస్ లోని నాలుగో వన్డే జరుగుతుంది.

విశాఖపట్నం వేదికగా భారతజట్టు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 90 శాతం విజయాల రికార్డు నమోదు కావడం విశేషం.

First Published:  15 Jun 2022 9:20 AM IST
Next Story