విశాఖ టీ20 : మూడు మార్పులతో బరిలోకి టీమిండియా..!
రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీ20 జట్టుకు ఇప్పుడు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా యి. అది కూడా స్వదేశంలో జరుగుతున్న మ్యాచులలో టీమిండియా విఫలం అవుతుండడం అభిమానులను కలవర పెడుతోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచులను కోల్పోయింది. రోహిత్ శర్మతో పాటు కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇవ్వడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్లో […]
రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీ20 జట్టుకు ఇప్పుడు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా యి. అది కూడా స్వదేశంలో జరుగుతున్న మ్యాచులలో టీమిండియా విఫలం అవుతుండడం అభిమానులను కలవర పెడుతోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచులను కోల్పోయింది. రోహిత్ శర్మతో పాటు కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇవ్వడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు.
ఐపీఎల్లో కెప్టెన్ గా రాణించిన పంత్ సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో మాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు. అతడు సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో వరుసగా రెండు మ్యాచ్ లు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పంత్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. కాగా.. ఇవాళ రాత్రి విశాఖ వేదికగా జరగనున్న 3వ టీ20 మ్యాచ్ లో మూడు మార్పులతో టీం ఇండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
గత రెండు మ్యాచుల్లో అటు బ్యాట్స్ మెన్ గా ఇటు బౌలర్ గా విఫలమైన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఐపీఎల్లో అద్భుతంగా రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భారీగా పరుగులు ఇస్తున్నాడు. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ లో అతడికి చోటు ప్రశ్నార్థకంగా మారింది. అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
అలాగే పేసర్ ఆవేశ్ ఖాన్ కు బదులుగా మరో పేసర్ ఆర్షదీప్ సింగ్ ని జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ టీమిండియాకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్ లో ఓడిపోతే సిరీస్ సౌత్ ఆఫ్రికా సొంతం అవుతుంది. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు తప్పనిసరిగా మారింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే కసితో భారత్ బరిలోకి దిగనుంది.