సమ్మర్‌లో వైల్డ్‌లైఫ్ సఫారీ చేస్తారా? దగ్గర్లోనే టైగర్ రిజర్వ్!
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారంలో ఉన్న దట్టమైన అడవుల మధ్యన కవాల్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఈ అడవిలో రకరకాల జంతువులతో పాటు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లను చూడొచ్చు.
సమ్మర్ సెలవుల్లో అడవులకు వెళ్లి వైల్డ్‌లైఫ్ సఫారీ చేయాలనుకుంటున్నారా? అయితే దానికోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. తెలంగాణలోనే ఓ టైగర్ రిజర్వ్ ఉంది. అక్కడ వైల్డ్‌లైఫ్ సఫారీ చేస్తూ పులులను వీక్షించొచ్చు. ఇంతకీ అదెక్కడంటే..
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారంలో ఉన్న దట్టమైన అడవుల మధ్యన కవాల్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఈ అడవిలో రకరకాల జంతువులతో పాటు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లను చూడొచ్చు.
కవాల్ టైగర్ రిజర్వ్‌కు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు వస్తుంటారు. సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి వైల్డ్‌లైఫ్ టూర్ వేసేందుకు ఇది మంచి ప్లేస్. ఇక్కడ పచ్చని అడవి అందాలతో పాటు రకరకాల వన్యప్రాణులు, పక్షులను సందర్శించొచ్చు. టూరిజం డిపార్ట్మెంట్.. ఇక్కడ జంగిల్ సఫారీని కూడా ఆఫర్ చేస్తోంది. అంతేకాదు ఇక్కడ స్టే చేసేందుకు కాటేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కవాల్ ఫారెస్ట్‌లో మచ్చల జింకలు, అడవిపందులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, చిరుతలు, పులులు సంచరిస్తుంటాయి. ఇక్కడ సుమారు 300 రకాల పక్షి జాతులు కూడా ఉన్నాయి. ప్రతీఏటా ఇక్కడ జరిగే ‘బర్డ్ వాచ్’ ఫెస్టివల్ చాలా ఫేమస్. ఈ ఫెస్టివల్‌కు దేశ నలుమూలల నుంచి ఎంతో మంది బర్డ్ లవర్స్ వస్తుంటారు. అలాగే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంటల్ స్టడీ సెంటర్లో రకరకాల జంతువుల స్కెలిటెన్‌లను చూడొచ్చు.
కవాల్ టైగర్ రిజర్వ్‌లో వైల్డ్‌లైఫ్ సఫారీ మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది. ఇది కాస్త చిన్న ఫారెస్ట్ కాబట్టి పులులు, చిరుతలు కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రోజులో మూడుసార్లు సఫారీ ట్రిప్స్ జరుతాయి. సఫారీ ట్రిప్ రెండు గంటల పాటు ఉంటుంది. సుమారు 20 కిలోమీటర్ల మేర సఫారీ సాగుతుంది. ఆరుగురికి కలిపి సఫారీ ఛార్జీ రూ. 2000 ఉంటుంది. రూమ్ ఛార్జీలు రూ.1,500 వరకూ ఉంటాయి. జన్నారం హైదరాబాద్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల చేరుకుని అక్కడ్నుంచి జన్నారం వెళ్లొచ్చు.