వర్షాకాలం కేరళ అందాలు.. బెస్ట్ ప్లేసులివే!
కేరళ రాష్ట్రమంతా పశ్చిమ కనుమలతో, అందమైన తీర ప్రాంతంతో విస్తరించి ఉంటుంది. అందుకే మాన్‌సూన్ సీజన్‌లో కేరళ మంచి ట్రావెలింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.
చూస్తుండగానే సీజన్ మారింది. ఇప్పుడు దేశమంతటా వర్షాలు కురుస్తున్నాయి. సూర్యుడి ఎండ తగ్గి మబ్బులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టూర్ వేయాలనుకునేవాళ్లకు కేరళ బెస్ట్ ఛాయిస్. వర్షాకాలం కేరళలో విజిట్ చేయాల్సిన ప్లేసులు ఏవంటే..
కేరళ రాష్ట్రమంతా పశ్చిమ కనుమలతో, అందమైన తీర ప్రాంతంతో విస్తరించి ఉంటుంది. అందుకే మాన్‌సూన్ సీజన్‌లో కేరళ మంచి ట్రావెలింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ముఖ్యంగా కేరళలో ఉన్న ఈ ప్లేసులను మాన్‌సూన్‌లో తప్పక విజిట్ చేయాలి.
వర్కాలా బీచ్
కేరళలోని అందమైన తీరాల్లో వర్కాలా తీరం కూడా ఒకటి. మిగతా బీచ్‌ల్లా కాకుండా వర్కాలా బీచ్ అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. బీచ్ చుట్టూ ఉండే పచ్చని కొండలు, నీలి రంగు సముద్రంతోపాటు వర్షం కూడా తోడైతే ఆ థ్రిల్లే వేరు. ఇక్కడ ఉండే చిన్నచిన్న కొండలను ట్రెక్ చేయొచ్చు. బీచ్ ఒడ్డున హోమ్ స్టే, హోటళ్ల వసతులు కూడా ఉంటాయి.
కోవలం
పచ్చని కొబ్బరి చెట్లతో తీరమంతా పరచినట్టు ఉంటుంది కోవలం. బీచ్ మాత్రమే కాకుండా కోవలం తీర ప్రాంతమంతా ఎంతో అందంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం ఈ ప్రాంతం మరింత అందంగా ముస్తాబవుతుంది. బీచ్ ఒడ్డున, బ్యా్క్ వాటర్స్ పక్కన పలు హోమ్‌స్టేలు, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
అలెపీ
వర్షాలు కురిసేటప్పుడు పడవలో ప్రయాణం చేస్తుంటే ఆ ఫీలింగే వేరు. ‘వెనిస్ ఆఫ్ ది ఈస్ట్’ గా చెప్పుకునే అలెపీ ప్రాంతమంతా బ్యాక్ వాటర్స్‌తో నిండి ఉంటుంది. ఈ వాటర్స్‌పై పడవ ప్రయాణం చేయడమే కాకుండా నీటి మధ్యలో పడువలోనే స్టే చేసే సౌకర్యం కూడా ఉంటుంది. మాన్‌సూన్‌లో కేరళ వెళ్తే అలెపీ విజిట్ చేయడం అస్సలు మర్చిపొవద్దు.
మున్నార్
కేరళలోని అందమైన హిల్ స్టేషన్స్‌లో మున్నార్ కూడా ఒకటి. ముఖ్యంగా మాన్‌సూన్‌లో ఇక్కడికి వెళ్తే మేఘాల్లో ప్రయాణిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇక్కడ టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పలు అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. స్టే, ఫుడ్ ఖర్చులు కాస్త ఎక్కువే. హనీమూన్ డెస్టినేషన్‌గా ఇది బాగుంటుంది.
వయనాడ్
సరస్సులు, నదులు, కొండలు, జలపాతాలు.. ఇలా విభిన్న ప్రకృతి అందాలకు కేరాఫ్.. వయానాడ్. వయానాడ్ అనేది కేరళలోని ఒక రూరల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఒక ప్లేస్ అని చెప్పడానికి లేదు. ఈ ప్రాంతమంతా పచ్చని పొలాలు, కొండలు, జలపాతాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా మాన్‌సూన్ సీజన్‌లో ఈ ప్రాంతమంతా పచ్చగా కనువిందు చేస్తుంది. ఎక్స్‌ప్లోర్ చేయాలే గానీ ఇక్కడ బోలెడు దాగి ఉన్న అందాలు కనిపిస్తాయి. హోమ్‌స్టేలు, క్యాపింగ్ సౌకర్యాలు కూడా ఉంటాయి.