మానుకోటలో పోలీసుల కవాతు దేనికి సంకేతం.. ఇదేం ప్రజాపాలన : కేటీఆర్

మానుకోటలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు పోలీసు బలగాలు కవాతు నిర్వహించడం దేనికి సంకేతం అని మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Advertisement
Update:2024-11-21 14:44 IST

మహబూబాబాద్ జిల్లా మానుకోటలో 144 సెక్షన్ అమలులో ఉండగా పోలీసు బలగాలు కవాతు నిర్వహించడం దేనికి సంకేతం అని మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదేనా మీ ప్రజాపాలన? అసలు మానుకోటలో ఏం జరుగుతుందని ‘ట్వీట్టర్’ వేదికగా కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు లేవు మరి ఈ పోలీసులు లాంగ్ మార్చ్ ఏంటని అక్కడ గొడవలు ఏం జరగలేదు..మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకని నిలదీశారు.

అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది. శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. ఇది ప్రజాపాలన ఎలా అవుతుందని, ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్షల పాలన, ఆంక్షల పాలన..మొత్తంగా రాక్షస పాలన’ అవుతుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఖబర్దార్ రేవంత్..ఇది తెలంగాణ..ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News