ఆ మూడు జిల్లాల్లో ఇవాళ సెలవు లేదు

తెలంగాణలోని మూడు జిల్లాల్లో రెండో శనివారం సెలవు రద్దయింది. బదులుగా నవంబర్ 9వ తేదీని వర్కింగ్ డే గా ప్రకటించారు.

Advertisement
Update:2024-11-09 07:50 IST

తెలంగాణలో మూడు జిల్లాలో రెండో శనివారం సెలవు లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి. సెప్టెంబర్ 17న వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ మూడు జిల్లాలకు సెలవు ఇచ్చారు. బదులుగా నవంబర్ 9వ తేదీని వర్కింగ్ డే గా ప్రకటించారు. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో మాత్రం సెలవు యథావిధంగా ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయి.. రాష్ట్రంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి నెలలో యథావిధిగా పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags:    
Advertisement

Similar News