జార్ఖండ్‌లో ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం

జార్ఖండ్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఎన్డీయే, ఇండియా కూటములు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Advertisement
Update:2024-11-11 19:32 IST

జార్ఖండ్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఎన్డీయే, ఇండియా కూటములు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జార్ఖండ్‌లో తొలి విడతగా 43 స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. చివరి రోజు ప్రచారానికి రాజకీయ పార్టీలు తమ పూర్తి బలాన్ని చాటుకోనున్నాయి. ఈ సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా 3 బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఛతర్‌పూర్, పాకీలో బహిరంగ సభలు నిర్వహించారు.

నవంబర్ 13న జరగనున్న ఫస్ట్ ఫేస్ ఎలక్షన్ ప్రచారానికి ఈరోజుతో తెరపడుతుందని జార్ఖండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) కె.రవికుమార్ వెల్లడించారు సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ఉన్న చోట్ల సాయంత్రం 5 గంటల వరకు, 4 గంటల వరకు ఓటింగ్ జరిగే చోట్ల సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయంగా సంబంధమున్న ఓటర్లు కాని వ్యక్తులు వెళ్లిపోవాల్సి వస్తుంది. ప్రచారం ముగిసిన తర్వాత అలాంటి వారిని పట్టుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News