సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య కలకలం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇది తనను కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

Advertisement
Update:2024-11-22 21:45 IST

సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లె ఆ గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్‌కి పాల్పడ్డారని, ఇది తనను కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. సాక్షాత్తు సీఎం సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి... నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ను ఆత్మహత్యకు ఉసిగొల్పిన వాళ్లపై చట్టరీత్యా చర్యలకు సిద్ధమా? మీ అన్నదమ్ముల అరాచకాలు శృతి మించాయనడానికి ఇది నిదర్శనం కాదా? సాయిరెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ములపై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలి" అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ సర్పంచ్ రాసిన సూసైడ్ నోట్ ను ఆయన ట్వీట్‌లో జత చేశారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నడని తెలుస్తోంది. మరణ వాగ్మూలంలో వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నడు సాయిరెడ్డి

Tags:    
Advertisement

Similar News