తెలంగాణ డీఎస్సీ ఫలితాలు రిలీజ్

డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో విడుదల చేశారు. కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే రిలీజ్ చేశారు.

Advertisement
Update:2024-09-30 12:25 IST

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెక్రటేరియట్‌లో రిజల్ట్స్‌ను రిలీజ్ చేశారు.కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉంటాయి.. జిల్లాల వారీగా.. తరువాత మెరిట్ రోస్టర్ ప్రకారం సెలెక్టెడ్ లిస్టును జిల్లాల వారీగా జిల్లా విద్యా అధికారులకు ఇస్తారని అధికారులు వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం.. సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:1 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/ లో చేక్ చేసుకోవచ్చును. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్​ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ సారి డీఎస్సీ పరీక్షలు రాశారు.

Tags:    
Advertisement

Similar News