రౌడీలు, చీటర్లు.. మల్లన్న పార్టీ అభ్యర్థులు

మల్లన్న పార్టీ అభ్యర్థి, హత్యాయత్నం కేసులో జైలులో ఉన్నాడనమాట. ఆమాటకొస్తే పార్టీ అధ్యక్షుడే ఇటీవల జైలునుంచి విడుదలై బయటకొచ్చారు. ఇక మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement
Update:2023-04-25 11:01 IST

చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న రాజకీయ హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. బీజేపీలో చేరి హడావిడి చేసి బయటకొచ్చిన మల్లన్న, చివరకు తనే సొంత పార్టీ పెట్టుకున్నారు. అంతే కాదు, అభ్యర్థుల్ని కూడా ప్రకటించారు. అయితే ఆ అభ్యర్థుల జాతకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా మల్లన్నపార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న దాసరి భూమయ్య వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య.. మల్లన్న టీమ్ స్టేట్ కన్వీనర్. పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి రిటైర్ అయిన తర్వాత భూమయ్య చేస్తున్న దందాలకు అంతే లేకుండా పోయింది. తాజాగా ఓ హత్యకు ప్రణాళిక రచించి పోలీసులకు చిక్కాడు భూమయ్య.

ఓ రియల్టర్‌ హత్యకు స్కెచ్‌ వేసిన మాజీ సీఐ భూమయ్య పన్నాగాన్ని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, గోపాలపురం పోలీసులు బయటపెట్టారు. రియల్టర్ హత్యకోసం లాడ్జిలో మాటు వేసిన చంద్రయ్య, శంకర్‌, కుమార్‌ ను అరెస్టు చేసి, వారి నుంచి ఒక తుపాకీ, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో కరీంనగర్‌ లో ఉన్న భూమయ్యను అరెస్టు చేశారు. నిందితులందరినీ రిమాండ్‌ కు తరలించారు. ఇప్పుడు మల్లన్న పార్టీ అభ్యర్థి, హత్యాయత్నం కేసులో జైలులో ఉన్నాడనమాట. ఆమాటకొస్తే పార్టీ అధ్యక్షుడే ఇటీవల జైలునుంచి విడుదలై బయటకొచ్చారు. ఇక మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉంటుందో చూడాలి.

మల్లన్నపై తీవ్ర విమర్శలు..

గతంలో తీన్మార్ మల్లన్న వార్తలు, ఆయన సెటైర్లు ఓ వర్గం వారికి కాస్త రుచించేవి. కానీ రాను రాను ఆ వార్తలు, వ్యాఖ్యానాల వెనక ఉన్న అజెండా బయటపడిపోయింది. బ్లాక్ మెయిల్ దందా అంటూ మల్లన్న వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మల్లన్నలాంటివారు చాలామంది ఆయన గ్రూప్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి వారే ఉన్నారని రుజువైంది. మల్లన్న టీమ్ స్టేట్ కన్వీనర్ హత్యాయత్నం కేసులో అరెస్ట్ కావడంతో ఇక ఆపార్టీ వ్యవహారం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఎన్నికల టైమ్ లో ఏదో ఒక హడావిడి చేయడానికే మల్లన్న రాజకీయ పార్టీ పెట్టారంటూ విమర్శలు వినపడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News