ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

సీఎం రేవంత్‌ రెడ్డికి టీఎన్‌జీవోల లేఖ

Advertisement
Update:2025-02-12 17:06 IST

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌ రెడ్డికి టీఎన్‌జీవోలు లేఖ రాశారు. బుధవారం నాంపల్లిలోని టీఎన్‌జీవో భవన్‌లో నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్‌, ఎస్‌ఎం హుస్సేని ముజీబ్‌, అసోసియేషన్‌ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్‌, కోశాధికారి రామినేని శ్రీనివాస రావు, 33 జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. పెండిండ్‌లో ఉన్న మూడు డీఏలు వెంటనే విడుదల చేయాలని, కొత్త పీఆర్సీ ప్రకటించి మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, పాత పెన్షన్‌ విధానం తిరిగి తెస్తామన్న హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు 50 ఉంటే అందులో ఆర్థిక భారం లేని సమస్యలే 45 ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ప్రకటించిన హామీలను నెరవేర్చాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News