వైసీపీ ఆరోపణలపై షర్మిల షాకింగ్ కామెంట్స్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు షర్మిల.

Advertisement
Update:2024-10-30 15:47 IST

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌తో ఆస్తుల వివాదం నేపథ్యంలో వైసీపీ ఆరోపణలకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు షర్మిల. ఈడీ అటాచ్ చేసింది రూ.32 కోట్లు విలువైన కంపెనీ ఆస్తి. షేర్ల బదిలీ పై ఆంక్షలు లేవు.. విజయమ్మకు రూ.42 కోట్ల షేర్లు ఎలా అమ్మారు..? నాకు 100 శాతం వాటాలు ఇస్తామని ఎంవోయూ పై జగన్ సంతకం చేశారు. బెయిల్ రద్దు అవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా..? అని ప్రశ్నించారు షర్మిల. నాకు 100% వాటలు ఇస్తామని ఎంవోయూపై జగన్ సంతకం చేశారు.

బెయిల్ క్యాన్సిల్ అవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా అని షర్మిల ప్రశ్నించారు.షేర్ల బదలాంపుపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు తనకు లేవని వెల్లడించారు. స్టేటస్‌కో ఉన్నది షేర్లపై కాదని తెలిపారు. గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. అటాచ్‌ చేసిన వాటి షేర్లు, స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్‌, బదిలీలు మాత్రం ఆపలేదని షర్మిల తెలిపారు. ఈడీ అటాచ్‌ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదనడం హాస్యాస్పదమని షర్మిల తెలిపారు.

Tags:    
Advertisement

Similar News