రాహుల్‌కు రేవంత్‌ థ్యాంక్స్‌

ప్రత్యేకంగా బర్త్‌ డే విషెస్‌ చెప్పినందుకు కృతజ్ఞతలు

Advertisement
Update:2024-11-08 23:31 IST

సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆయనకు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ 'ఎక్స్‌' పోస్ట్‌ పెట్టారు. 'మీరు స‌మ‌యం కేటాయించి నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపినందుకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు రాహుల్ భ‌య్యా..' అని రాసుకొచ్చారు.

కొంత కాలంగా సీఎంపై రాహుల్ గరంగా ఉన్నాడంటూ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రుణమాఫీ సభలకు సీఎం రేవంత్ రెడ్డి పిలిచినా రాహుల్ గాంధీ రాలేదు. అదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ రాహుల్ గాంధీ ఆగ్రహానికి కారణం అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కులగణన కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం రాహుల్ గాంధీ హైదరాబాద్ లో పర్యటించారు. బోయిన్‌పల్లి గాంధీ నాలెడ్జ్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్‌ కంటే మంత్రులు భట్టి, ఉత్తమ్‌లతోనే ఎక్కువగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆరోజు కూడా అంటీముట్టనట్టే ఉన్నట్టు వ్యవహరించారని టాక్‌. చాలామంది సీనియర్లను కాదని రేవంత్‌ సీఎం కావడానికి రాహుల్‌ గాంధీ నే కారణమనే వాదనలున్నాయి. అలాంటిది వాళ్లిద్దరి మధ్య కొన్నిరోజులుగా దూరం పెరిగిందని వార్తలు వస్తున్న సమయంలో రాహుల్‌ గాంధీ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్టు సీఎం రేవంత్‌ ఎక్స్‌లో తెలుపడం గమనార్హం. నేడు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Tags:    
Advertisement

Similar News