అప్పుడే డీఎస్సీ నియామకాలు : సీఎం రేవంత్
తెలంగాణ డీఎస్సీ నియామకాలు మరో 10 రోజుల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
Advertisement
డీఎస్సీ నియామకాలు మరో 10 రోజుల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇవాళ సచివాలయంలో ఫలితాలు విడుదల సందర్భంగా సీఎం మాట్లాడుతూ చాలా తక్కువ సమయంలో రిజల్ట్స్‌ను రిలీజ్ చేశామని తెలిపారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని అన్నారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకే ఒక్కసారి 7 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించిందని గుర్తు చేశారు. కానీ, తాము అధికారంలోకి వచ్చిన కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలను విడుదల చేశామని అన్నారు. చెప్పినట్లుగానే టీజీపీఎస్‌సీని సమూలంగా ప్రక్షాళన చేశామని పేర్కొన్నారు. డీఎస్సీ మాదిరిగానే గ్రూప్-1 పరీక్షలను నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
Advertisement