దేవుళ్ళకు, రాక్షసులకు యుద్దం అంటూ బీజేపీ ప్రచారం... ఈసీకి టీఆరెస్ పిర్యాదు

బీజేపీ నేతలను రామభక్తులుగా, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను రాక్షసులుగా ప్రచారం చేస్తూ బీజేపీ నేతలు అభ్యంతరకర పదజాలం వాడుతున్నారని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు వారు ఈసీకి పిర్యాదు చేశారు.

Advertisement
Update:2022-10-19 09:02 IST

మునుగోడు ఉప ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.బీజేపీ ప్రచారం ప్రజల మధ్య విభజనను రేకిత్తేంచేలా, మతకలహాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని టీఆరెస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు సోమ భరత్, దేవి ప్రసాద్, రమేష్ రెడ్డిలు డిప్యూటీ సీఈవో సత్యవాణికి ఫిర్యాదు చేశారు.

బీజేపీ నేతలను రామభక్తులుగా, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను రాక్షసులుగా ప్రచారం చేస్తూ బీజేపీ నేతలు అభ్యంతరకర పదజాలం వాడుతున్నారని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఈ ఎన్నికలు దేవుళ్లకు, రాక్షసులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని బీజేపీ ప్రచారం చేస్తోందని టీఆరెస్ నేతలు పిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పచ్చి బూతులు, అభాండాలు, దేవుళ్లపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని తెరాస నేత సోమ భరత్ అన్నారు. రూ.40 వేలు తీసుకొని బీజేపీకి ఓటు వేయండి అంటూ ప్రచారం చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆరెస్ నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కి ఉంది. కానీ వారు మాత్రం బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని వారు ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News