ఏడో రౌండ్ నుంచి పెర‌గ‌నున్న టీ ఆర్ ఎస్ మెజారిటీ..!

మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఆరు రౌండ్ల అనంత‌రం చూస్తే టీ ఆర్ ఎస్, బీజేపీ అభ్య‌ర్థుల మ‌ధ్య ఓట్ల తేడా స్వ‌ల్పంగా మాత్ర‌మే ఉంది.

Advertisement
Update:2022-11-06 12:59 IST

మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఆరు రౌండ్ల అనంత‌రం చూస్తే టీ ఆర్ ఎస్, బీజేపీ అభ్య‌ర్థుల మ‌ధ్య ఓట్ల తేడా స్వ‌ల్పంగా మాత్ర‌మే ఉంది. ఆరు రౌండ్లు పూర్త‌య్యేస‌రికి టీ ఆర్ ఎస్ అభ్య‌ర్థి బీజేపీ అభ్య‌ర్థిపై 2,169 ఓట్ల ఆధిక్య‌త‌తో కొన‌సాగుతున్నారు.

చౌటుప్ప‌ల్‌, సంస్థాన్ నారాయ‌ణ్‌పూర్ల‌లో తొలి ఆరు రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు పూర్త‌యింది. చౌటుప్ప‌ల్‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న బీజేపీకి అక్క‌డ నిరాశే ఎదురైంది.

ఇక రానున్న‌ది మునుగోడు మండ‌ల ఓట్ల లెక్కింపు. ఇది క‌మ్యూనిస్టుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న మండ‌లం కాబ‌ట్టి, టీ ఆర్ ఎస్‌కి క‌మ్యూనిస్టులు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో 7, 8 రౌండ్ల‌లో టీ ఆర్ ఎస్ మెజారిటీ భారీగా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా.

Tags:    
Advertisement

Similar News