టీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉండండి.. మునుగోడు యువతకు కేటీఆర్ పిలుపు

ప్రభుత్వ రంగంలో కూడా శరవేగంగా ఉద్యోగాల భర్తీ.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన చేస్తున్న ప్రభుత్వానికి మునుగోడు యువత మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

Advertisement
Update:2022-10-24 13:40 IST

పరిశ్రమల స్థాపన ద్వారా ప్రైవేటు రంగంలో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా ఉండాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగంలో కూడా శరవేగంగా ఉద్యోగాల భర్తీ.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన చేస్తున్న ప్రభుత్వానికి మునుగోడు యువత మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. సోమవారం ట్విట్టర్ వేదికగా మునుగోడు నియోజకవర్గం పరిధిలో యువత కోసం చేసిన పనులను ఆయన వెల్లడించారు.

తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడను మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం 2019లోనే నెలకొల్పిందని చెప్పారు. దాదాపు 35 వేల మంది స్థానిక యువతకు ఉపాధిని అందించే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కులు కూడా రాబోతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవెలప్‌మెంట్ సెంటర్ నిర్మాణం కూడా శర వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలకు.. ముఖ్యంగా యువత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న యువత తప్పకుండా టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

Tags:    
Advertisement

Similar News