ఆయన 'రేవంత్'రెడ్డి కాదు.. 'రేటెంత'రెడ్డి

చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్‌.. రేవంత్‌ రెడ్డిలాంటి ఓటుకు నోటు దొంగతో తలపడాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు కేటీఆర్‌. ఓవైపు ఓటుకు నోటు దొంగ, మరోవైపు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా డ్రామాలాడిన కిషన్‌ రెడ్డితో పోటీ అవమానకరంగా ఉందన్నారు.

Advertisement
Update:2023-10-08 07:59 IST

బీజేపీది మేకప్‌.. కాంగ్రెస్‌ ది ప్యాకప్‌ అని సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌, బీజేపీలకు బీ టీమ్‌ కావాల్సిన అగత్యం బీఆర్‌ఎస్‌ కు పట్టలేదని, తాము తెలంగాణ ప్రజలకే ఏ టీం అని స్పష్టంచేశారు. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పాత్ర లేకుండా ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉండబోదన్నారు. మహారాష్ట్రకు కేసీఆర్‌ పోతుంటే కాంగ్రెస్‌, బీజేపీలకు వణుకు పుడుతోందన్నారు మంత్రి కేటీఆర్.

'రేటెంత'రెడ్డి..

ఆనాడు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన రేవంత్ రెడ్డి.. నేడు సీటుకు నోటు అంటూ కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని, మరింతగా దిగజారిపోయారని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఆయన్ని రేవంత్‌ రెడ్డి అని పిలవడం లేదని.. ‘రేటెంత’రెడ్డి అని పిలుస్తున్నారని సెటైర్లు పేల్చారు. రేవంత్‌ రెడ్డి ఒరిజినల్‌ గా ఆర్‌ఎస్‌ఎస్‌ మనిషి అని, కార్వాన్‌ లో కిషన్‌ రెడ్డికి పోలింగ్‌ ఏజెంట్‌ గా పని చేసిన వ్యక్తి అని.. ఇప్పటికీ వారిద్దరి మధ్య చీకటి సంబంధం కొనసాగుతోందని విమర్శించారు. గాంధీభవన్‌ లో ఈ గాడ్సేను కూర్చోబెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లేనని మండిపడ్డారు కేటీఆర్.

అవమానంగా ఉంది..

చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్‌.. రేవంత్‌ రెడ్డిలాంటి ఓటుకు నోటు దొంగతో తలపడాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు కేటీఆర్‌. ఓవైపు ఓటుకు నోటు దొంగ, మరోవైపు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా డ్రామాలాడిన కిషన్‌ రెడ్డితో పోటీ అవమానకరంగా ఉందన్నారు. రేవంత్, కిషన్ రెడ్డి.. ఇద్దరూ తెలంగాణ ఉద్యమానికి తీరని అన్యాయం చేశారని, ఇలాంటివాళ్లతో మనకు పోటీయా? అని ప్రశ్నించారు. వాళ్లకు ఒక్క ఓటు పడ్డా తలవంచుకోవాల్సిన పరిస్థితి అని చెప్పారు కేటీఆర్.

"మనం తెలంగాణ బిడ్డలం, రోషం, పౌరుషం గల బిడ్డలం. ఏ నిర్ణయమైనా తెలంగాణ గల్లీలో జరగాల్సిందే. కానీ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతాయి. బీఫాం ఢిల్లీలో, స్కీంలకు అనుమతి ఢిల్లీలో, చివరకు బాత్‌ రూంకి పోవాలన్నా ఢిల్లీలోనే అనుమతి తీసుకోవాలి. ఢిల్లీలో మోకరిల్లే సన్నాసులు, దౌర్భాగ్యులు మనకు అవసరమా." అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News